Home

»

Tv News

Ye Devi Varamo Neevu : అంజలి అసలు నిజం బయటపెట్టిన రాజారావు.. షాక్‌లో రత్నం!

Aug 16, 2026 9:38AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -36 లో.....గీత కోపంగా ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవ్వు గీతూ అని బాను చెప్తాడు. నా పుట్టింటికి నేను తన వల్ల దూరం అయ్యానని గీత ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు రాజారావుని డాక్టర్ చెక్ చేస్తాడు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని అతను చెప్తాడు. రాజారావుకి అంజలి టాబ్లెట్ ఇస్తుంది. డాక్టర్ బయటకి వచ్చి శంకర్ వాళ్లతో మాట్లాడతాడు. మీరు తాతయ్యని ఇప్పుడేం అడగకండి అని రత్నం వాళ్ళతో మనీష్ చెప్తాడు.

రాజారావుతో అంజలి మాట్లాడుతుంది. నా వల్ల మీకు గొడవలు ఎందుకు తాతయ్య అని అడుగుతుంది.. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అంజలి అనగానే నీ బాధ్యత తీసుకున్నా.. అది నెరవేర్చనివ్వకుండా చేసి నా గుండె ఆగేలా చెయ్యకని రాజారావు అనగానే సరే తాతయ్య నేను ఎప్పుడు వెళ్ళనని అంజలి చెప్తుంది. ఆ తర్వాత నాన్న ఎందుకు ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.. ఇప్పుడే నాకు తెలియలి.. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మనీష్ తో శంకర్ అంటాడు. శంకర్ లోపలికి వస్తుంటే అంజలి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 

నాన్న ఎందుకు అంజలి కోసం చెల్లిని దూరం చేసుకున్నారని రాజారావుని శంకర్ అడుగుతాడు. తనని నేను చూసుకుంటానని బాధ్యత తీసుకున్నాను అందుకే అని రాజారావు చెప్తాడు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడకని రాజారావు అంటాడు. ఆ తర్వాత గీత దగ్గరికి మనీష్ వెళ్తాడు. ఎవరో తెలియనట్లు గీత మాట్లాడుతుంది. దాంతో మనిష్ బాధపడుతాడు. తరువాయి భాగంలో అసలు అంజలి ఎవరు.. నా మీద ఒట్టేసి చెప్పండి అని రాజారావుని రత్నం నిలదీస్తుంది. మన గీతాంజలి కూతురు అంజలి అని రాజారావు చెప్పగానే రత్నం షాక్ అవుతుంది. ఆ మాటలు విన్న అంజలి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Ye Devi Varamo Neevu serial, Star Maa, Rajarao and Anjali, Telugu serial update, serial review

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com