
జబర్దస్త్ టైం మారింది వీక్ మారింది. ఇప్పుడు ఆదివారం సాయంత్రం స్లాట్ లోకి వచ్చేసింది. ఇక దీని మీద చెప్పడానికి ఆది పెళ్ళికొడుకు గెటప్ లో పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న కాన్సెప్ట్ తో పంచ్ లు వేయడానికి సోలో స్కిట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక ఆదిని ఎపిసోడ్ కి వచ్చిన జెన్ జి యూత్ కూడా పెళ్లి గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే ఆడియన్స్ లో కూర్చున్న జబర్దస్త్ కమెడియన్ అజార్ కూడా ఆదిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకప్పుడు అందరూ ఆ జబర్దస్త్ ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు ధీ ఎప్పుడూ అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లి పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. అప్పుడెప్పుడో చంటి అన్నను అనేవాళ్ళు పెళ్లి కాలేదు అని. ఆ తర్వాత భాస్కర్, సుధాకర్, షేకింగ్ శేషు, షకలక శంకర్ అంతా అడిగేసరికి వీళ్ళు పెట్టె బాధలకన్నా పెళ్లయ్యాక భార్య పెట్టే బాధలే ఎక్కువ అనుకుని పెళ్లి చేసుకున్నాడు.
ఇక్కడికి వచ్చిందంతా జెన్ జి బ్యాచ్ కదా పెళ్లి మీద కొన్ని ఇన్స్పిరేషనల్ మాటలు చెపుదాం అని చెపుదాం. కాలం కలిసొస్తే కాక్రోచ్ అంటారు కలిసి రాకపోతే తూచ్ ఇదే సరదాగా చేసాం అంటారు అంటూ ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాల్ని కూడా మిక్స్ చేసి పంచులు వేసాడు. ఏమన్నా డౌట్స్ అడగండి అన్నాడు ఆది. ఇంతలో అజార్ లేచి "మీకు పెళ్లి కాలేదు రష్మీ గారికి పెళ్లి కాలేదు మీరెందుకు రష్మిని చేసుకోవచ్చు కదా " అన్నాడు. ఆ మాటకు రష్మీ షాకింగ్ ఫేస్ పెట్టింది. "అబ్బా ఇదెవరన్నా అడిగితే బాగుండు అనుకుంటున్నాను నేను చేసుకోవడానికి హ్యాపీరా ఎందుకంటే మోడీ గారు బంగారం కొనుకోవద్దు అన్నారు కానీ బంగారాన్ని పెళ్లి చేసుకోవద్దు అనలేదు కదా " అంటూ లాజిక్ చెప్పాడు.
ఇక ఆది ఆడియన్స్ లో కూర్చున్నాడు. ఇక రష్మీ ఐతే "ఇంతకు ఆది గారికి పెళ్లి జరుగుతుందా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ జడ్జెస్ మీరేమంటారు" అని అడిగింది. "నాకు కూడా అదే డౌట్ గా ఉంది. " అన్నారు నాగబాబు. "మాములుగా ఐతే జరిగేలా లేదు సర్ ఎక్కడో అక్కడ దొరికితే వాళ్ళే చేస్తారేమో " అన్నాడు ఆది కామెడీగా. ఇంతలో ఇంద్రజ " అలా ఏమన్నా ఎరేంజ్ చేసారంటే నేనే వెళ్లి చెడగొట్టేస్తాను. ఒక అమ్మాయిని కాపాడతాను " అన్నారు. "ఆది నీకు ఇండియా వద్దు. ఫారెన్ లో మంచి అమ్మాయిని చూస్తాను " అన్నారు నాగబాబు. "ఫారెన్ ఐతే పెళ్లి అవసరం లేదు సర్ " అన్నాడు ఆది.






