రష్మీ తెలుగు నేర్పించొచ్చుగా...పోనీ రొమాన్స్ చేయడం నేర్పనా ?
on Jun 24, 2025
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో బోనాల జాతర స్పెషల్ థీమ్ తో రాబోతోంది. ఈ షోకి బలగం వేణు ఎంట్రీ ఇచ్చాడు. అలాగే మార్గన్ మూవీ టీమ్ వచ్చింది. విజయ్ ఆంటోనీ ఫుల్ జోష్ తో ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేశారు. అలాగే రష్మీని ఆట పట్టించారు. ఇక రష్మీ ఐతే వెల్కమ్ విజయ్ సర్ అంటూ ఇన్వైట్ చేసింది. "తెలుగులో మాట్లాడ్డం ఎలాగో ట్రైనింగ్ ఇవ్వొచ్చుగా" అంటూ విజయ్ ఆంటోని రష్మీని అడిగేసరికి ఇంద్రజ పడీపడీ నవ్వేసింది. "మా రష్మీ మీకు తెలుగు నేర్పిస్తే తెలుగులో మాట్లాడాలని ఆశ పడుతున్నారా"అని కౌంటర్ వేసింది.
"రొమాన్స్ గురించి ఏదన్నా పోనీ నేర్పించొచ్చుగా..లేదంటే నేర్పనా " అని అడిగేసరికి రష్మీ వెంటనే విజయ్ ఆంటోనితో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసింది. లవ్ ప్రొపోజ్ చేసేటప్పుడు ఎలా ఐతే మోకాళ్ళ మీద కూర్చుంటారో రష్మీ ముందు విజయ్ ఆంటోని కూడా అలాగే మోకాళ్ళ మీద కుర్చునేసరికి రష్మీ ఫిదా ఐపోయింది. ఆల్రెడీ సర్కార్ సీజన్ కి విజయ్ ఆంటోనీ వచ్చి రష్మీతో సుధీర్ జోడి గురించి సుధీర్ ని అడిగారు. ఇక ఇప్పుడు ఈ షోలో రష్మీతో కలిసి డాన్స్ చేశారు. ఇక బోనాల స్పెషల్ అందరూ బోనాల మీద సాంగ్స్ పాడి జాతర చేసారు. కొంతమందికి పూనకాలు కూడా వచ్చేసాయి. ఇంద్రజ కూడా వాళ్లందరితో కలిసి బోనాల డాన్స్ లో పార్టిసిపేట్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
