Home

»

Tv News

బుల్లితెర నటులకు అవార్డులు... అమరదీప్, సిరి హన్మంత్, టేస్టీ తేజ ....

Aug 7, 2026 6:14PM

అవార్డు అంటే టాలెంట్ కి ఇచ్చే ఒక ప్రోత్సాహకం. చిన్నగా భుజం తట్టడం అన్నమాట. వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళ నైపుణ్యాలను బట్టి అవార్డ్స్ ఇవ్వడం అందుకోవడం సహజం. అంటే ఆ చిన్న ప్రోత్సాహం ఎన్నో విజయాలకు కారణమవుతుంది. మరి సినీ, టీవీ రంగాల్లో నటిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తూ కామెడీ చేస్తూ నవరసాలు పాడిస్తూ జనాలను ఆహ్లాపరచడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వాళ్లకు అవార్డ్స్ ఇవ్వడం అంటే వాళ్ళను గౌరవించుకోవడమే.

అలాంటి కొంతమంది బుల్లితెర స్టార్స్ ని ఐకాన్ అవార్డ్స్ వరించాయి. ఇంతకు ఎవరెవరికి వచ్చాయంటే... చెన్నై లవ్ స్టోరీ మూవీలో బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో నటించినందుకు సిరి హన్మంత్ , సుమతి శతకం మూవీలో విమర్శకుల ప్రశంసలు అందుకుని బెస్ట్ కమెడియన్ గా టేస్టీ తేజ, ఆర్ కె. దీక్ష మూవీకి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా డాన్స్ అక్సా ఖాన్, కే - రాంప్ మూవీలో బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ కిర్రాక్ సీత, మోతెవరి లవ్ స్టోరీలో బెస్ట్ డెబ్యూ లీడ్ యాక్టర్ గా అనీల్ జీల, మన శంకర్ వరప్రసాద్ మూవీలో హుక్ స్టెప్ సాంగ్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్, నాగబంధంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సోనియా సింగ్, సుమతి శతకంలో విమర్శకుల ప్రశంసలు అనుకుని బెస్ట్ యాక్టర్ గా నిలిచిన అమర్ డీప్ ఇలా బుల్లితెర మీద కనిపించే వాళ్లంతా కూడా త్వరలో ఈ ఐకాన్ అవార్డ్స్ ని అందుకోబోతున్నారు. ఈ అవార్డ్స్ అందుకుంటున్న వాళ్లంతా కూడా కష్టపడి వాళ్ళ వాళ్ళ దారుల్లో దూసుకుపోతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం , వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నారు.  అమరదీప్, రోహిణి, టేస్టీ తేజ, సిరి హన్మంత్ వీళ్లంతా అటు సీరియల్స్ లో ఇటు షోస్ లో మూవీస్ లో ఎటు ఛాన్స్ వస్తే అటు వైపు అడుగులు వేస్తున్నారు. ఇక అక్సా ఖాన్ డాన్సర్ గా అందరికీ పరిచయం అలాగే మూవీస్ లో కూడా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది.
-----------------

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com