Home

»

Tv News

నా ఫ్యామిలీకి లేని ప్రాబ్లమ్ మీకెందుకు...నాతో పెట్టుకోవద్దు ఖబడ్దార్

Apr 05, 2026

నైనికా ఆనసురు బుల్లితెర మీద ఫుల్ ఫేమస్. ఢీ షో తర్వాత బిగ్ బాస్లో ఇక ఇప్పుడు బిబి జోడిలో అమరదీప్తో కలిసి పెర్ఫార్మ్  చేసింది. అలాంటి నైనికా రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టింది. "నేనేం  చేస్తున్నాను, ఏమి తాగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను, ఎలాంటి బట్టలు వేసుకున్నాను అనే విషయాలపై చాలామంది  ఎంతలా  ఆసక్తి చూపిస్తున్నారో నేను గమనిస్తున్నాను. నేను ఒక పబ్లిక్ ఫిగర్ని కాబట్టి  అందరూ నేను చేసే పనుల మీద దృష్టి పెడతారని నాకు తెలుసు.  కానీ కొంతమంది చేస్తున్న కామెంట్స్, పెడుతున్న వీడియోస్ నాకు అస్సలు నచ్చడం లేదు. మీరు నమ్మరు కానీ నాకున్న పవర్తో నేను మిమ్మల్ని నాశనం చేయగలను. నేనే గనక ఆ విషయాలను కోర్ట్ వరకు తీసుకెళ్తే మీరే పెద్ద చిక్కుల్లో పడతారు.  నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు. వాళ్లకు ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు మీరు మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే బెటర్. నా జోలికి రాకండి.  అందరికీ ధన్యవాదాలు హ్యాపీగా మీరు మీ జీవితాలను చూసుకోండి. నా ప్రియమైన వారందరికీ అసలు ఏమైందని నన్ను అడగొద్దు.  ఏమీ జరగలేదు. కానీ అప్పుడప్పుడు నాకు బాధ కలిగినప్పుడల్లా నాకు నేను కూడా నిలబడాలిగా " అంటూ చాలా ఘాటైన స్టేటస్ పెట్టుకుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com