బాలయ్య బాబు ఎపిసోడ్ ఇంకా ఉంటె బాగుండనిపించింది : వాగ్దేవి
on Jun 23, 2022
తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి తన గానంతోనే కాదు అందంతో కూడా జూనియర్ పూజ హెగ్డే అనే మంచి టైటిల్ ని కూడా బాలయ్య దగ్గర నుంచి చిరంజీవి దగ్గర నుంచి అందుకుంది. ఇలా వాళ్ళు తనని పూజ హెగ్డే తో పోల్చడం చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పింది వాగ్దేవి. బాలయ్య ముందు ఆయన సాంగ్ పాడడం సంతోషంగా ఉంది. ఎందుకేనట ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన జస్ట్ అమేజింగ్ . ఆయన ఉన్నంత సేపు చాలా సందడిగా ఉంటుంది అక్కడి వాతావరణం . ఇంకా ఎక్కువ సేపు ఉంటె బాగుండనిపించింది..ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా విషయాన్నీయాంకర్ అడిగేసరికి అలాంటిది ఏమీ ఉండదు. బాలయ్య బాబు ఏది ఆన్ కెమెరా ఉండాలో డిసైడ్ చేసి చెప్తారు. అదే ప్రసారమవుతుంది అంది వాగ్దేవి. ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్లెవరకూ కూడా అక్కడవుండే అందరిని మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు ఉంటాయి. ఆయన మంచి పాజిటివ్ ఎనెర్జీని ఇస్తారు అందరికీ.
ఇండియన్ ఐడల్ స్టేజి మీద ఆయన వచ్చి మాతో కలిసి నాలుగు స్టెప్పులు వేసేసరికి మాలో అప్పటివరకు ఉన్న టెన్షన్స్ అన్ని ఎగిరిపోయాయి. ఇండియన్ ఐడల్ స్టార్ట్ ఐన దగ్గరనుంచి ఒక్కో స్టెప్ క్రాస్ చేస్తూ వచ్చి విన్ అవ్వాలి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది చాలా టఫ్ కాంపిటీషన్ అని కానీ ధైర్యంగా ముందుకు వెళ్లాను. తెలుగు ఇండియన్ ఐడల్ విన్ అయ్యాను వాటితో పాటు జూనియర్ పూజాహెగ్డే, వావ్ దేవి అనే టైటిల్స్ కూడా అందుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది వాగ్దేవి. వాగ్దేవి ఇండియన్ ఐడల్ స్టేజి మీద బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో నందమూరి నాయకుడినే పొదుపు కథ పొడిచిన ఎపిసోడ్ సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యింది..