.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -693 లో..... అందరి ముందు జ్యోత్స్న పేరు చెప్పకుండా దీప ఆపుతుంది. ఎందుకు దీప గారు అలా చేశారని సూరజ్ అంటాడు. జ్యోత్స్న రెస్టారెంట్ కి తాత గారు తన భార్య పేరు పెట్టారు.. అంటే ఇప్పుడు జ్యోత్స్న చేసిన తప్పుని మనం బయట పెడితే అక్కడ పరువుపోయేది జ్యోత్స్న రెస్టారెంట్ ది ఇన్నాళ్లుగా మంచి పేరు సంపాదించింది పోతుంది. పైగా సొంత మనవరాలు ఇలా చేసిందంటూ ఇంకా పరువుపోతుందని దీప చెప్తుంది.
మీరు ఎంత బాగా చెప్పారు అండి అని దీపని సూరజ్ మెచ్చుకుంటాడు. ఆ తర్వాత జ్యోత్స్ననే ఈ పని చేసిందని పారిజాతానికి అర్థమై.. ఇప్పుడు నీ పేరు బయటకు వస్తే ఏం చేస్తావని అడుగుతుంది. రాదని జ్యోత్స్న కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. ఆ కుట్ర వెనుక అసలు సూత్రదారి ఉన్నారని కార్తీక్ అనగానే ఎవరు వాళ్ళు అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. తన పేరు చెప్పడానికి వస్తున్నాడని కార్తీక్ గుమ్మం వంక చూస్తాడు. అప్పుడే మాణిక్యరావుని తీసుకొని సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. మాణిక్యరావుని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇప్పుడు ఇతను తన వెనకాల ఉండి చేయించిన వారి పేరు చెప్తాడని కార్తీక్ అంటాడు. చెప్పొద్దని అతనికి జ్యోత్స్న సైగ చేస్తుంది. ఇక కార్తీక్ బెదిరించేసరికి తప్పక జ్యోత్స్న మేడమ్ ఇదంతా చేయించిందని అతను చెప్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్పిస్తున్నారు.. అక్కడ అందరి ముందు ఎందుకు చెప్పాలేదని పారిజాతం అనగానే మాణిక్యాన్ని దీప పంపించి.. అక్కడ సంస్థ పరువుపోకూడదని అలా చేసానని దీప చెప్తుంది.
జ్యోత్స్న ని సుమిత్ర కొట్టబోయి ఆగిపోతుంది. నిన్ను ఇలా పెంచినందుకు సిగ్గుపడుతున్నామని సుమిత్ర అంటుంది. దీప ఎందుకు నా కూతురుగా పుట్టలేదు.. ఏ సంబంధం లేని దీప, ఈ ఇంటిపరువుపోకూడదని ఆలోచించిందని సుమిత్ర అంటుంది. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది.. తిట్టడానికి మాటలు కూడా రావట్లేదని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
