హౌ డేర్ యు..మీరెవరు అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పడానికి ?
on Jun 27, 2025

శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ వెళ్లి అందరినీ అలరించిన నటి. అటు మూవీస్ లో కూడా నటించింది. ఆమె రీసెంట్ గా ఏజె మైసూర్ అలియాస్ అజయ్ మైసూర్ అనే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇతను కూడా ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అనే మూవీ తీసాడు. ఇతనితో శుభశ్రీ మింగిల్ అయ్యింది. ఐతే వీళ్ళ పెయిర్ మీద చాల నెగటివ్ ట్రోలింగ్స్ వచ్చాయి. దాని గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ చాలా ఫీలయ్యింది. "ఆయన గురించి చెప్తూ డార్క్ కలర్ లో ఉన్నాడు. అసలు ఎలా నచ్చాడు." అంటూ కామెంట్స్ చేశారు. "ఐనా ఆ విషయాలు చెప్పడానికి మీకెంత ధైర్యం..హౌ డేర్ యు..మీరెవరు అసలు ఎలాంటి పార్ట్నర్ ని చూజ్ చేసుకోవాలో చెప్పడానికి.. "అంటూ గట్టిగా క్లాస్ పీకింది."కట్నం ఎంతిస్తున్నారు...మనీ, మనీ, మనీ అంటున్నారు...మనీ డిగ్గర్, ఆరు నెలలు కలిసుంటే చూద్దాం..ఎందుకు ఎవరూ పాజిటివ్ గా ఉండరు..నేను ఏదన్నా రాంగ్ చేసానా " అసలు ఏంటి కామెంట్స్ అంటూ తెగ ఫీలయ్యింది. తర్వాత హోస్ట్ అజయ్ మైసూర్ కి ఫోన్ చేయమని శుభశ్రీతో చెప్పింది.
దాంతో ఆమె నిజంగా ఫోన్ చేసింది. "మిమ్మల్ని అంతలా ట్రోల్ చేస్తుంటే మీరు మాత్రం అంత హ్యాపీగా ఎలా ఉన్నారు" అంటూ హోస్ట్ వర్ష అడిగింది. "నా ఫస్ట్ మూవీ 2019 లో వచ్చిన "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"..నేను అప్పటి నుంచే నేను ట్రోలింగ్ కి అలవాటు పడ్డాను..హటర్స్, లవర్స్ అందరి రెస్పాన్స్ కి థ్యాంక్యూ. వి రాక్ " అని చెప్పాడు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి చేసిన "మెజెస్టీ ఇన్ లవ్" అనే కవర్ సాంగ్ వచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



