
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -410 లో.. విశ్వ, భాగ్యం ఆనందరావు ముగ్గురు మాట్లాడుకుంటారు. విశ్వ హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రింక్ చేస్తూ డ్రింక్ ఆనందరావుకి పోస్తాడు. ఆ అమూల్య రోజోకో టార్చర్ పెడుతుంది. వేడివేడి సాంబార్ చెయ్ పై పోస్తుంది. టీ పెట్టమంటే మోషన్స్ టాబ్లెట్ కలిపి ఇస్తుంది. దాని వెనకాల ఎవరో ఉన్నారు.. అందుకే అంత దైర్యంగా చేస్తుందని విశ్వ అంటాడు. ఏంటి బాబు ఏనుగులా ఉన్నారు మీరు.. అమూల్యకి భయపడడం ఏంటి.. తనని రెచ్చగొట్టేలా మాట్లాడండి అన్నీ తనే చెప్తుందని భాగ్యం సలహా ఇస్తుంది.
నా భార్య మేధావి అంటూ ఆనందరావు తన భార్యని పొగుడుతాడు. మరొకవైపు ఇంట్లో అందరు డల్ గా ఉంటార. శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు ఎంత సంతోషంగా ఉన్నా బయటకు బాధగా నటించాలని అనుకుంటుంది. అప్పుడే భాగ్యం వచ్చి.. ఆ నర్మద వాళ్ళ గదిలో మేం ఉంటాం.. వాళ్ళు ఇక తిరిగిరారు.. ఈ ఇంటిని మన గుప్పిట్లో పెట్టుకోవాలని భాగ్యం అంటుంది. అప్పుడే ధీరజ్, ప్రేమ కలిసి నర్మద, సాగర్ ని తీసుకొని ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. వాళ్ళని గుమ్మం దగ్గరే ఉంచుతుంది ప్రేమ. ఏ దిష్టి తాకిందో ఏమో అక్కబావకి దిష్టి తియ్ శ్రీవల్లి అక్క.. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కదా అని ప్రేమ అంటుంది. ఇక శ్రీవల్లికి ఇష్టం లేకపోయినా దిష్టి తీస్తుంది. రామరాజు సైలెంట్ గా లోపలికి వెళ్తాడు.ఆ తర్వాత థాంక్స్ రా అక్కబావని ఇంటికి రప్పించావని ధీరజ్ తో ప్రేమ అంటుంది. థాంక్స్ ఎవరైనా ఇలా చెప్తారా అని ప్రేమకి దగ్గరగా ధీరజ్ వస్తాడు. దాంతో ప్రేమ నెట్టేస్తుంది. ఒక పందెం పెట్టుకున్నాం.. నేను ఓడిపోతే నేను ముద్దు ఇస్తాను.. నువ్వు ఓడిపోతే నువ్వు ఇవ్వాలని ధీరజ్ అంటాడు. వద్దని ప్రేమ అంటుంది. సరే నువ్వు గెలిస్తే నీ ఇష్టం.. నేను గెలిస్తే ముద్దు ఇస్తానని ధీరజ్ అంటాడు. దానికి ప్రేమ ఒప్పుకొని ధీరజ్ ఓడిపోయేలా ప్రేమ రొమాంటిక్ గా చూస్తుంది.
ధీరజ్ ఓడిపోతాడు. ప్రేమ నువ్వు గెలిచావ్ కాబట్టి ఏం చెయ్యాలి చెప్పమని ధీరజ్ అంటాడు. టైం వచ్చినప్పుడు చెప్తానని ప్రేమ అంటుంది. ధీరజ్ నుదిటిపై ముద్దు పెడుతుంది. మరి బుగ్గ మీద అని ధీరజ్ అంటాడు. చెంపపై ప్రేమ ఒక్కటేస్తుంది.. ధీరజ్ సిగ్గు పడుతాడు. మరొకవైపు హమ్మయ్య వాళ్ళు ఇంటికి వచ్చారని రామరాజుతో వేదవతి అంటుంది. బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా వెళ్లొచ్చు.. కోడలు అని నెత్తిన పెట్టుకున్నందుకు తను కూడా మోసం చేసిందని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







