Home

»

Tv News

వచ్చే ఏడాదిలో శ్రీముఖి పెళ్లి...మిస్ నుంచి మిస్సెస్ గా... జోగిని శ్యామల చేతుల మీద సారె..!

Aug 10, 2026 2:55PM

మా బోనాల జాతర ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ స్టార్ మా ఆదివారం నాడు ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో అమూల్య - నిరంజన్ లవ్ ఎపిసోడ్ మ్యారేజ్ ప్రొపోజల్స్  అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇక ఫైనల్ గా జోగిని శ్యామల సారె తీసుకుని వచ్చారు.  ఇక ఆవిడ వస్తూనే నాట్యం చేస్తూ వచ్చారు. "అందరూ బాగున్నారా. తెలుగు ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా మా టీవీకి రావడం ఆనందంగా ఉంది. ఒక ఆడబిడ్డను ఇంటికి పిలిచినట్టు ప్రతీ సంవత్సరం మా టీవీ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. ఒక ఆనవాయితీగా ఇది రెండో సంవత్సరం. చాల బాగా అనిపిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలాగా ఒక థీమ్ ల కాకుండా ఒక కల్చరల్ రిప్రెజెంటేటివ్ లా మా టీవీ ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తోంది. " అని చెప్పారు.

తర్వాత శ్రీముఖి కూడా చెప్పింది. "అమ్మ వారి సారె కోసం ఇక్కడికి వచ్చిన మూడు టీమ్స్ ప్రాణం పెట్టి గేమ్స్ ఆడాయి. ఐతే అన్ని పోటీల్లో గెలిచింది సికింద్రాబాద్ షేర్స్ ఐతే ఈ ఇది ఒక టీమ్ కి పరిమితం చేయకుండా అందరికీ సరిసమానంగా ఈ సారె ఎవరికీ ఇవ్వాలి అనే విషయం మీద లక్కీ డ్రా తీసి వారికి ఇస్తాం అందులో నా పేరు కూడా ఉంటుంది . మీరు ఆ డ్రా తియ్యాలి ఎవరి పేరు వస్తుందో వారికి ఆ సారె ఇవ్వాలి " అని చెప్పింది.

ఇంతలో జ్యోతక్క తన కోరిక  బయటపెట్టింది. లాస్ట్ ఇయర్ ఇదే టైములో నాకు సారె ఇచ్చారు . ఈరోజు నేను ఆరు నెలల వెన్నెలమ్మతో ఒక బిడ్డకు తల్లినయ్యాను నాకు చాలా సంతోషంగా ఉంది. ఐతే ఇప్పుడు నేను అడిగే ఈ కోరిక తప్పు బట్టుకోరు అనుకుంటున్నా. స్టార్ మాలో అన్ని షోస్ ని సింగల్ హ్యాండ్ తో నడిపిస్తూ అలాగే అందరి పెళ్లిళ్లు, ప్రొపోజల్స్ చేస్తూ సీమంతాలు, బారసాలలు చేస్తూ మూడేళ్ళ నుంచి అలరిస్తోంది. అక్కడ ఒక వస్తువు ఉన్న దాంతో కూడా ఎంటర్టైన్మెంట్ చేయించగల సత్తా ఉన్న శ్రీముఖికి పెళ్లి అనేది ఒక్కటే ఉండిపోయింది. ఇంకెప్పుడు పెళ్లి అని . ఇంకెప్పుడు అనే మాట లేదు. మొన్న వాళ్ళ అమ్మ కూడా చెప్పింది పెళ్లి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాం అని. వాళ్ళ అమ్మ గట్టిగా ప్రయత్నిస్తే ఈ అమ్మ గట్టిగా దీవెనలిస్తే మళ్లొచ్చే సంవత్సరానికల్లా శ్రీముఖి పెళ్లి కావాలని కోరుకుంటున్న. అందుకే ఈ సారె ఎలాంటి లక్కీ డ్రా లేకుండా శ్రీముఖికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ అంతా కలిసి ఆ సారెను శ్రీముఖికి అందించారు. "నేను ఒక ఇంటి దాన్ని కావాలని ఇక్కడున్న వారంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు నేనెప్పుడూ చెప్పలేదు. నెక్స్ట్ బోనాన్ని కల్లా నేను శ్రీముఖిగా కాకుండా మిస్సెస్ శ్రీముఖిగా రావాలని కోరుకుంటున్నా ..ఆ అమ్మ వారి ఆశీర్వాదం నా చేతుల్లో ఉండగా ఇంకేం కావాలి " అని సారెను అందుకుంది శ్రీముఖి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com