.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -686 లో.... స్టాల్ నుంచి జ్యోత్స్న కోపంగా ఆఫీస్ కి వెళ్తుంది. దీప కూడా వెళ్తుంది. ఎవరి క్యాబిన్ లో వాళ్ళు కూర్చొని ఉంటారు. అప్పుడే జ్యోత్స్న దగ్గరికి మేనేజర్ వచ్చి.. మేడమ్ కాఫీ, టీ జ్యూస్ ఏమైనా కావాలా అని అంటాడు. దాంతో జ్యోత్స్న తనపై కోప్పడుతుంది. ఇప్పుడు నేను ఏం అన్నానని మేనేజర్ అంటాడు. మీరు జ్యూస్ కావాలా అని అడిగారు కదా అదే ఆవిడా ప్రాబ్లమ్ అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత మేనేజర్ ని దీప పిలిచి ఏదో మెయిల్ వచ్చింది చూడమని చెప్తుంది. మేనేజర్ అది చూసి మేడమ్ ఒక ఆఫర్ వచ్చింది. ఒక కంపెనీ కూడా ఫుడ్ డెలివరీ చెయ్యాలి.. అది ప్లేట్ అరవై రూపాయలకి అని ఆ మెయిల్ ఉన్న మ్యాటర్ దీపతో మేనేజర్ చెప్తాడు.
అరవై రూపాయలకి క్వాలిటీ ఫుడ్ సప్లై చెయ్యలేం.. క్వాలిటీ లేకపోతే రెస్టారెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది.. వద్దని దీప చెప్పగానే మేనేజర్ ఆర్డర్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత శివన్నారాయణకి ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతారు. దాంతో శివన్నారాయణ కోపంగా దీప, కార్తీక్, జ్యోత్స్న, మేనేజర్ ని పిలుస్తాడు. శాండల్ వుడ్ కంపెనీ నుంచి ఫుడ్ ఆర్డర్ వస్తే ఎందుకు రిజెక్ట్ చేసారని మేనేజర్ పై శివన్నారాయణ కోప్పడతాడు. దీప మేడమ్ చెప్పారని మేనేజర్ చెప్తాడు. అవును నేనే చెప్పాను ప్లేట్ కి అరవై రూపాయలు అడిగారని దీప అంటుంది. వాళ్ళు అంత చీప్ గా అడిగారా.. అలా అడుగరని శివన్నారాయణ అనగానే దీప మెయిల్ చూపిస్తుంది. ఆ మెయిల్ ని కార్తీక్ ని చదవమని చెప్తాడు. కార్తీక్ అది చదివి ప్లేట్ కి అరవై రూపాయలని ఎవరు చెప్పారు.. ఇందులో నూట అరవై అని ఉందని కార్తీక్ అనగానే మేనేజర్ చెప్పాడని దీప అంటుంది. మేనేజర్ వచ్చి. ఏంటి మేడమ్ నా మీద తోస్తున్నారని మేనేజర్ మాట మారుస్తాడు. దాంతో దీపపై శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఇలాంటి వాళ్ళు సీఈఓగా పనికి రారు అని జ్యోత్స్న అనగానే అవునని శివన్నారాయణ అంటాడు. ఇప్పుడే దీపని పంపించండి అని శివన్నారాయణ అంటాడు. ఒక ఛాన్స్ ఇవ్వండి అని దీప రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో శివన్నారాయణ సరే అంటాడు.
ఆ తర్వాత అదంతా జ్యోత్స్న మేనేజర్ తో ఆడిన నాటకమని కార్తీక్, దీప , దశరథ్ కి తెలుస్తుంది. నువ్వు కార్తీక్ హెల్ప్ తీసుకోవద్దు కానీ నీ కింద ఒక ఎంప్లాయిని పెట్టుకొని వాళ్ళ సాయం తీసుకోవచ్చని దీపకి దశరథ్ ఒక ఐడియా ఇస్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లో జరిగిందంతా జ్యోత్స్న వెళ్లి పారిజాతానికి చెప్తుంది. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కార్తీక్ వచ్చి మాట్లాడుతాడు. దీప ఎక్కడ అని పారిజాతం అడుగుతుంది. దీప తన ఆయుధం కోసం వెళ్ళిందని కార్తీక్ అనగానే దీప ఎక్కడికో వెళ్తుందని దీపని ఫాలో అవుతూ జ్యోత్స్న వెళ్తుంది. సూరజ్ ని దీప కలిసి.. మీరు నాతో వర్క్ చెయ్యాలని చెప్తుంది. అలాగే జ్యోత్స్నతో ఉన్న పోటీ గురించి చెప్తుంది. నాకు అలా వర్క్ చెయ్యడం ఇష్టం లేదు.. నాకు ఇలానే చెయ్యడం ఇష్టమని సూరజ్ చెప్తాడు. సరే మీ ఇష్టమని దీప అంటుంది. అసలు సూరజ్ ని దీప ఎందుకు కలిసిందని జ్యోత్స్న అనుకుంటుంది. ఈ సూరజ్ గాడికి ఇప్పుడు బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
