మన అడ్డాకి వస్తున్నా!
on Jan 9, 2022

బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయి ఇన్ని రోజులు గడుస్తున్నా దాని ప్రకంపనలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే వున్నాయి. ఈ షో సన్నీని విజేతగా నిలిపి హీరోని చేస్తే షణ్ముఖ్ జస్వంత్ ని మాత్రం నిజంగా విలన్ ని చేసిందని చెప్పాల్సిందే. ఈ షోతో షణ్ముఖ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అనుకున్న దానికి మించి తల్లకిందులైంది. కప్ గెలవకపోగా గాళ్ ఫ్రెండ్ దీప్తి సునయనని కూడా కోల్పోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ షో కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరగడమే కాకుండా బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
సిరితో కలిసి షన్ను చేసిన అతి కారణంగానే బయటి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ప్రచారంలో ఉన్న దాని ప్రకారం ఈ కారణం వల్లే దీప్తి .. షన్నుకి బ్రేకప్ చెప్పేసి షాకిచ్చింది. నెట్టింట మీమ్స్ ఓ రేంజ్ లో వినిపించాయి. దారుణంగా ట్రోల్ చేశారు కూడా. హౌస్ లో సిరి, షన్ను రొమాన్స్ గురించి నెట్టింట పెద్ద రచ్చే నడిచింది. ఫలితం షన్నుని అథం పాతాళానికి తొక్కేసి సన్నీని హీరోని చేసింది. అది అక్కడితో ఆగక రియల్ లైఫ్‌పై పడింది.
Also read: "నా వెనుక నిలిచింది నా తండ్రి ప్రేమ!" వైరల్ అయిన దీప్తి ఎమోషనల్ పోస్ట్!!
ఇదిలా వుంటే చాలా రోజులుగా సైలెంట్ గా వున్న షన్ను మళ్లీ రంగంలోకి దిగుతున్నానని తాజాగా పోస్ట్ పెట్టాడు. దీప్తి తనతో బ్రేకప్ చేసుకోవడంపై వెంటనే స్పందించి అది తన హక్కు అని పాజిటివ్ గానే స్పందించన షన్ను తను మళ్లీ తన రొటీన్ లైఫ్ కి రెడీ అయిపోతున్నానని వెల్లడించాడు. నటించి చాలా కాలమైందని, ఇక షూటింగ్ కు వెళ్లేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు షన్ను. "మన అడ్డాకి వస్తున్నా... త్వరలోనే వివరాలు ప్రకటిస్తా" అని ఇన్ స్టా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి తన అభిమానుల్లో జోష్ నింపాడు షన్ను.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



