Home

»

Tv News

Illu illalu pillalu:ప్రేమ గురించి రహస్యం తెలుసుకున్న శ్రీవల్లి.. ధీరజ్ ఏం చేయనున్నాడు!

Mar 13, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-417 లో.. ప్రేమ పుట్టినరోజు కావడంతో వేదవతి పూజ చేసి ఆశీర్వదిస్తుంది. అప్పుడే రాత్రి ధీరజ్ తనకి ప్రపోజ్ చేశాడనే నిజం చెప్తుంది. దాంతో వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది‌. ఇక ఆ సంతోషంలో అందరికి పాయసం చేస్తుంది వేదవతి. ఇక ఆ తర్వాత రామరాజు దగ్గర ప్రేమ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక అక్షింతలు తీసుకొని ధీరజ్ దగ్గరికి వెళ్ళగానే తనని సారీలో చూసి ధీరజ్.. ఏంటే ఈ రోజు వింతగా ప్రవర్తిస్తున్నావని అంటాడు. 

ఇక ధీరజ్ దగ్గర ప్రేమ ఆశీర్వాదం తీసుకుంటుంటే శీగ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ధీరజ్ దీవిస్తాడు. కనపడవు కానీ చాలానే కళలున్నాయిరా నీలో అని ప్రేమ అంటుంది. చాలా సినిమాలలో ఇలానే దీవిస్తారు కదే అందుకే అలా దీవించానని ధీరజ్ అంటాడు.  ఇక ఇద్దరు కాసేపు సరదాగా ఉంటారు. మరోవైపు సాగర్, నర్మదలని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది వేదవతి. అక్కడ పాయసం ఇచ్చి ఇద్దరిని తినమని చెప్తుంది. అక్కడే రామారాజు కూర్చొని తింటూ ఉంటాడు. సాగర్ తింటూ ఉండగా రామారాజు లేచి నిల్చుంటాడు. ఏంటండి తిని వెళ్ళండి అని వేదవతి అనగానే.. ఈ ఇల్లు, రైస్ మిల్ నా కష్టార్జితంతో సంపాదించుకున్నా.. కానీ అలా లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకోలేదు.. అలాంటి వాడి పక్కన కూర్చొని తింటుంటే నాకు అసహ్యంగాను, వొళ్ళంతా పాములు తేళ్ళు పారుతున్నట్టుగానూ ఉందని చెప్పి రామారాజు వెళ్ళిపోతాడు. ‌ఇక వెంటనే సాగర్ లేచి నిల్చుంటాడు. తినండి అని నర్మద అనగానే ఇప్పుడే గడ్డి పెట్టాడు కదా చాలాదా అని సాగర్ అంటాడు. ఏరా నడిపోడా తినరా అని వేదవతి అంటున్నా వినకుండా సాగర్ వెళ్లిపోతాడు‌‌. 

మరోవైపు భాగ్యం, ఆనందరావు సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. ఏంటని భాగ్యం అడుగగా..‌అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది ప్రేమనే.. ఇక తన జుట్టు నా చేతిలో ఉందని శ్రీవల్లి అనగానే భాగ్యం హ్యాపీగా ఫీల్ అవుతుంది.‌ ఇక ఆ ప్రేమని ఇంటినుండి బయటకి గెంటేపిస్తానని శ్రీవల్లి మాట్లాడుతుండగా అప్పుడే చందు వస్తాడు. వెంటనే ఫోన్ కాల్ కట్ చేస్తుంది శ్రీవల్లి. ఏంటని చందు అడగగా ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది శ్రీవల్లి. మరోవైపు నర్మద, ప్రేమ కలిసి అమూల్య కోసం వేదవతి చేసిన పాయసాన్ని తీసుకెళ్తారు. అమూల్య బాగుందని తింటూ ఉంటుంది. ఆ తర్వాత మా అక్క దగ్గరికెళ్ళి బావని ఒప్పించి డబ్బులు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టి కార్ తెచ్చుకుందామని ప్రేమతో ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com