నాకే నీ బుగ్గలు కొరకాలని అనిపిస్తోందిరా!
on Oct 18, 2021
బుల్లితెరపై స్టార్ కమెడియన్ 'సుడిగాలి' సుధీర్, స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ' షోల్లో రన్ చేసే లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. దాంతో పాటు సుధీర్ మీద అందరూ పంచ్ డైలాగ్స్ వేస్తుంటారు. అమ్మాయిల్ని ఈజీగా పడేస్తాడని. అక్కడితో ఆగకుండా తనను తీసుకువెళ్లడం లేదంటూ ఆది కామెడీ చేస్తుంటాడు.
రోజా కూడా సుధీర్‌పై అప్‌కమింగ్ ఎపిసోడ్లో సేమ్ టాపిక్ మీద సెటైర్స్ వేశారు. 'కెవ్వు' కార్తీక్ స్కిట్లో సుధీర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. అందులో ఓ అమ్మాయితో డాన్స్ చేశాడు. వాళ్లిద్దరూ 'మురారి' సినిమాలో 'అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి...' పాటకు పెర్ఫార్మన్స్ చేయడం చూస్తుంటే... పెళ్లి స్కిట్ టైపు ఉంది. ఆ పాట పూర్తయిన తర్వాత 'లాస్ట్ వీక్ వచ్చింది. అప్పుడే సెట్ చేసేశావా?' అని సుధీర్ మీద రోజా డైలాగ్ వేశారు. 'నేనేం చెయ్యలేదండీ బాబు' అంటూ సుధీర్ వివరణ ఇచ్చుకున్నాడు. 'బాబోయ్' అంటూ రోజా దణ్ణం పెట్టారు.
తర్వాత 'వీడిని ఎలా ప్రేమించావు?' అని ఆ అమ్మాయిని కార్తీక్ ప్రశ్నిస్తే... 'ఒక్కటే మాట చెప్పాడు' అన్నది. వెంటనే 'నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో లేదో గానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా' - రష్మీకి సుధీర్ చెప్పిన డైలాగును రోజా చెప్పారు. స్టేజి మీద సుధీర్ నవ్వుతూ నిలబడ్డాడు. 'అదే డైలాగ్' అని అమ్మాయి అనడంతో 'ఇదే డైలాగ్ ఎంతమందికి చెబుతావురా?' అని సుధీర్ ను కార్తీక్ ప్రశ్నిస్తాడు. 'నాకు అదొక్కటే వచ్చు. ఇక్కడ వర్కవుట్ అయ్యింది' అన్నాడు సుధీర్.
ప్రతి వారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోగ్రామ్ ప్రారంభంలో ఒక పాటకు రష్మీ గౌతమ్ డాన్స్ చేస్తుంది. కొత్త ప్రోమోలో రష్మీని ఇమిటేట్ చేస్తూ నాటీ నరేష్ డాన్స్ చేయడం చూపించారు. సిగ్గుతో రష్మీ చీర కొంగును ముఖానికి అడ్డుపెట్టుకుంది. అయితే, రోజా మాత్రం 'ఒరేయ్! నాకే నీ బుగ్గలు కొరకాలని అనిపిస్తుందిరా. అంత క్యూట్ గా ఉన్నావ్' అని కాంప్లిమెంట్ ఇచ్చారు. దాంతో నరేశ్ తెగ సిగ్గుపడిపోయాడు.
Also Read