.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1053 లో....ఇందు సీఈఓ అవ్వకుండా ఉండాలని తనని ఐశ్వర్య కిడ్నాప్ చేస్తుంది. ఎందుకు అక్కవి అయి ఉండి ఇలా చేస్తున్నావ్.. నేను మీటింగ్ కి అటెండ్ అవ్వాలి.. లేకపోతే నష్టాల్లోకి వెళ్తామని ఐశ్వర్యని ఇందు రిక్వెస్ట్ చేస్తుంది. అయిన ఐశ్వర్య పట్టించుకోదు. అదంతా నారాయణ కిటికీలో నుండి చూస్తాడు. అక్క అని అంటుంది అదేంటి అంత కఠినంగా ఉంది.. పాపం ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తుంది.. ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలని నారాయణ అనుకుంటాడు.
మరొకవైపు మీటింగ్ మొదలవుతుంది. ఆ ఇందు ఏంటి ఇంకా రావడం లేదని రేఖ అనుకుంటుంది. నేను ఇప్పటివరకు కంపెనీని బాగా చూసుకున్నాను.. మీ సపోర్ట్ ఉంటే ఇక మీదట కూడా బాగా చూసుకుంటానని రేఖ అంటుంది. కంపెనీలో ఇప్పడేం ప్రాబ్లమ్స్ లేవంటారా అని మీటింగ్ లో ఒకతను అడుగుతాడు. ఉన్నాయి లేవు అని అనడం లేదు.. వాటిని పరిష్కరిస్తూ ముందుకి వెళ్లడమే గొప్ప లక్షణం అని రేఖ తన ప్రపోజల్ ని బోర్డు మెంబర్స్ ముందు పెడుతుంది. అలాగే రాజు కూడా నన్ను సీఈఓని చెయ్యండి అని తన ప్రపోజల్ చెప్తాడు. దాంతో ఇద్దరు రేఖకి మరొక ఇద్దరు రాజుకి సపోర్ట్ చేస్తారు. నేను ఉహించినట్లే జరిగింది. ఇప్పుడు ఈ పరంధామయ్య నాకు ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యడని రేఖ అనుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి పరంధామయ్య గారు మీ ఓటు ఎవరికి అని రేఖ అడుగుతుంది. నా ఓటు నీకు వెయ్యాలని లేదు అలాగని అతనికి వెయ్యడం నాకు ఇష్టం లేదు.. కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వండి.. ఇంకా టైం ఉంది కదా అని పరంధామయ్య అంటాడు.
మరొకవైపు ఇందుని కాపాడడానికి నారాయణ అక్కడున్న రౌడీలతో కలిసి డ్రింక్ చేసి వాళ్ళని కొడుతాడు. ఇందు దగ్గరికి నారాయణ వస్తాడు. అక్కడే ఐశ్వర్య కూడా ఉంటుంది. ఎవరు నువ్వు అని ఐశ్వర్య అడుగుతుంది. ఇందాక దారిలో ఎదురుపడ్డది నేనే అని నారాయణ అంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తానని నారాయణ అంటాడు. తరువాయి భాగంలో అక్కడ పరంధామయ్యపై నీ ఓటు ఎవరికి అని రేఖ ఒత్తిడి పెడుతుంది. దాంతో అతను రేఖ పేరే చెప్పాలని అనుకుంటాడు. మరొకవైపు ఇందుని నారాయణ బైక్ పై ఎక్కించుకొని మీటింగ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
