Home

»

Tv News

Jayam serial : దుబాయ్ నుండి గంగ కోసం వచ్చిన అన్నయ్య.. చెల్లెలి కాపురం చక్కదిద్దుతాడా!

Mar 05, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -208 లో...గంగ దగ్గరికి తనతో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన అన్నయ్య దుబాయ్ నుండి వస్తాడు. తనని చూసి అన్నయ్య అని ప్రేమగా దగ్గరికి వస్తుంది గంగ. ఎవరు అతను అని ఇంట్లో వాళ్లు అడుగుతారు. నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అని గంగ చెప్తుంది. దుబాయ్ నుండి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను చెల్లెమ్మ అని అతను అంటాడు. అప్పుడే రుద్ర వచ్చి అతని మాటలు చూసి అన్నాచెల్లి ఒకేలా ఉన్నారుగా అనుకుంటాడు.

ఆ తర్వాత ఇప్పుడే వెళ్ళకు అన్నయ్య ఒక రెండు రోజులు ఉండు అని గంగ అనగానే నాలుగు రోజులు ఉంటానని అతను చెప్తాడు. ఆ తర్వాత గంగ తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక తన పెళ్ళి ఎలా జరిగిందో మొత్తం చెప్తుంది అలాగే ఇషిక, వీరు గురించి కూడా చెప్తుంది. ఇప్పుడు రుద్ర సర్ భాను గారి కోరికలు తీర్చే పనిలో ఉన్నారని గంగ అంటుంది అయితే తన కోరికలు ఏంటో భాను బాబు తన భార్యకి చెప్పి ఉంటాడు కదా వెళ్లి అడుగుదామని అతను అనగానే గంగ వాళ్ళ అన్నయ్య, గంగ ప్రమీల దగ్గరికి వస్తారు. అప్పుడే ఇషిక, వీరు వచ్చి ఇంట్లో వంట పని ఎవరు చేస్తారని ప్రమీలని అడుగుతారు. నాకు కొంచెం తల నొప్పిగా ఉందని ప్రమీల చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మాట్లాడుతుంటే ప్రమీల ఏడుస్తూ వెళ్తుంది. ఇలాగే ఇంట్లో వాళ్ళ అందరిని మనకి బానిస చెయ్యాలని ఇషిక, వీరు అనుకోవడం గంగ ఇంకా వాళ్ళ అన్నయ్య వింటారు. 

గంగ వాళ్ళ అన్నయ్య, గంగ ఇద్దరు రుద్ర దగ్గరికి వెళ్తారు.  ప్రమీలతో వీరు, ఇషిక వాళ్లు మాట్లాడిన మాటలు ఇంట్లో వాళ్లని తమ బానిసలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం గంగ చెప్తుంది. భాను కోరిక తీర్చే మార్గం దొరికింది ప్రమీలకి పెళ్లి చెయ్యాలని రుద్ర అనగానే గంగ షాక్ అవుతుంది. మీ నిర్ణయం సరైనదే కానీ మీ పెద్దమ్మ దీనికి ఒప్పుకోదని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com