Illu illalu pillalu : అమూల్యని కాపాడిన శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ అదేనా!
on Dec 5, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -333 లో... నర్మద, ప్రేమ ఇద్దరు కలిసి ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే మావయ్యకి మీ గురించి మొత్తం చెప్తానని శ్రీవల్లి కి వార్నింగ్ ఇస్తారు. అయ్యో చెల్లి ఇక మీదట అలాంటి తప్పు చెయ్యనని అక్కడ నుండి వెళ్ళిపోయి అక్కడున్న బస్తాలని ప్రేమ, నర్మద అనుకొని వాటిని కొడుతుంది. అదంతా ప్రేమ, నర్మద చూసి.. ఏమైంది అక్క మారుతుంది అన్నావ్ కదా అని ప్రేమ అంటుంది. ఇద్దరు కలిసి మళ్ళీ శ్రీవల్లి దగ్గరికి వస్తారు.
అసలు నీకు బుద్ది రాదా అంటూ కోప్పడతారు. దాంతో శ్రీవల్లి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక లాభం లేదు ఈ వల్లి ఎంఏ ఇంగ్లీష్ చదివిన అంటుంది కదా తనకి జాబ్ చూడాలి.. అప్పుడే ఇలా అన్ని విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటుందని ఇద్దరు అనుకుంటారు. హ నిజంగా చదివిందో లేదో కూడా బయటపడుతుందని ప్రేమ అంటుంది. మరొకవైపు విశ్వ ఇచ్చిన చీర అమూల్య కట్టుకుంటుంది. ఈ చీర ఎక్కడిది అని వేదవతి అడుగుతుంది. శ్రీవల్లి వదిన ఇచ్చిందని అమూల్య చెప్తుంది. అదేంటి నిన్న నాతో ఫ్రెండ్ ఇచ్చింది అన్నావని ధీరజ్ అనగానే అంటే వదిన ఇచ్చింది కూడా కలర్ ఇలాగే ఉంటుంది.. కన్ఫ్యూజ్ అయ్యానని అమూల్య అంటుంది. వేదవతి, శ్రీవల్లిని పిలిచి ఇలాంటి కలర్ ఉన్న చీర అమూల్యకి ఇచ్చావా అని అడుగుతుంది. ఇచ్చానని శ్రీవల్లి అనగానే అమూల్య రిలాక్స్ అవుతుంది. అందరు వెళ్ళాక ఈ చీర విశ్వ ఇచ్చాడని శ్రీవల్లికి అమూల్య చెప్తుంది.
మరొకవైపు తిరుపతి ఇంటిబయటే ఉంటాడు. చందు, సాగర్ గేట్ దగ్గరే ఉండి మాట్లాడతారు. రామరాజు వస్తాడు. ఇక తిరుపతి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. రామరాజు లోపలికి పిలుస్తాడు. ఆ తర్వాత పూజ జరుగుతుంది. ప్రేమ, ధీరజ్ టామీ అండ్ జెర్రీ లాగా పోట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



