Home

»

Tv News

Brahmamudi : శ్రీశైలం వెళ్తున్న  దుగ్గిరాల కుటుంబానికి పొంచి ఉన్న ప్రమాదం!

Feb 25, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -964 లో......కావ్య, రాజ్ కలిసి దుగ్గిరాల ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన బాధ్యతలు ఇంట్లో మనిషిగా కావ్యకి అప్పగిస్తారు. ఏం ప్రాబ్లెమ్ రాకుండా చూసుకోమని మినిస్టర్ కి రాజ్ చెప్తాడు. అప్పుడే శ్రీశైలం వెళ్ళడానికి వ్యాన్ వచ్చిందని రాజ్ కి తెలుస్తుంది. దాంతో రాహుల్ నువ్వు బయటకు వెళ్లి వ్యాన్ కండిషన్ లో ఉందో చెక్ చెయ్ అని రాజ్ చెప్పగానే రాహుల్, రేఖ బయటకు వెళ్తారు. అక్కడ డ్రైవర్ తో మాట్లాడుతారు. డ్రైవర్ ని రాహుల్ పంపిస్తాడు.

రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి తన మనిషి వచ్చాడని చెప్తుంది. రౌడీ వ్యాన్ కిందకి వెళ్లి బాంబ్ సెట్ చేస్తాడు. మనం వేరే వెహికల్ లో ఎలా వెళ్తామని రేఖ అనగానే దానికి ప్లాన్ చేసాను.. స్వప్ననే వేరే వెహికల్ లో వెళదాం అనేలా చేసానని రాహుల్ అంటాడు. అప్పుడే స్వప్న వచ్చి విజయవాడ ప్రాపర్టీస్ లో ఏదో టాక్స్ ప్రాబ్లమ్ ఉందట మనం వెళ్ళాలని అంటుంది. శ్రీశైలం వెళ్లి రిటర్న్ లో ఆ వర్క్ చూసుకుందామని రాహుల్ అంటాడు. అయితే మనం వేరే వెహికల్ లో వెళదామని స్వప్న అనగానే రాహుల్ సరే అంటాడు. రౌడీ బాంబ్ పెట్టి బయటకు వచ్చి వెళ్ళిపోతాడు. మరొకవైపు రేవతి, జగదీష్ వాళ్ళ బాబుతో బారసాల కి వస్తారు. కావ్య పాపని అపర్ణ ఉయ్యాలలో వేస్తుంటే నేను వేస్తాను. నాకూ కాబోయే భార్య కదా అని రేవతి బాబు స్వరాజ్ అంటాడు. అందరు నవ్వుతారు. కావ్య పాపకి ఇందు అని పేరు పెడుతారు. అప్పు పాపని ధాన్యలక్ష్మి ఉయ్యాలలో వేసి నందన అని పేరు పెడుతుంది. బారసాల ముగిసాక అందరు శ్రీశైలం వెళ్ళడానికి వ్యాన్ ఎక్కుతారు.

ఏంట్రా మీరు రావడం లేదని రాహుల్ ని రాజ్ అడుగుతాడు. ప్రాపర్టీ లో ఏదో ప్రాబ్లమ్ ఉందట రాజ్.. మేము శ్రీశైలం వెళ్లి రిటర్న్ లో ఆ పని చూసుకొని వస్తామని రాహుల్, స్వప్న చెప్తారు. దుగ్గిరాల కుటుంబంతో పాటు కనకం, కృష్ణమూర్తి, రేవతి, జగదీశ్, స్వరాజ్ వ్యాన్ ఎక్కుతారు. రాహుల్, స్వప్న, రేఖ మాత్రం వేరొక వెహికల్ లో బయల్దేరతారు. అందరు బయలుదేరిన విషయం రుద్రాణికి రేఖ చెప్తుంది. పాయింట్ కి రాగానే రుద్రాణి బాంబ్ బ్లాస్ట్ చెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది. వ్యాన్ లో అందరు సరదాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com