Home

»

Tv News

Brahmamudi : ఉప్మాలో ఫెవికాల్ కలిపిన నందు.. ఇందు మసాజ్ ట్రీట్‌మెంట్‌కు రాజు బలి!

Jul 18, 2026 11:07AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1087 లో.. ఐశ్వర్య, భ్రమరాంబలకి అపర్ణ టిఫిన్ చేసి వడ్డిస్తుంది. ఇదేమైనా టిఫిన్ ఆ  అని భ్రమరాంబ కోప్పడుతుంది. అప్పుడే నందు వచ్చి అవును నానమ్మ నీకు అసలు వంటలు రావు నేను చేస్తానని నందు అనగానే శేషు షాక్ అవుతాడు. ఏంటండి మీరు తను ఆడపిల్ల కాదా,  ఏంటి అన్ని పనులు వచ్చి ఉంటాయి ఒంటరిగా పెరిగింది కదా అన్ని పనులు వస్తాయని భ్రమరాంబ అంటుంది. అవును అన్ని వచ్చు అని నందు కిచెన్ లోకి వెళ్లి వాళ్ళకి ఉప్మా చేస్తుంది. ఆ ఉప్మాలో ఫెవికాల్ కలుపుతుంది.

ఆ తర్వాత నందు ఉప్మా తీసుకొని వచ్చి వడ్డిస్తుంది. భ్రమరాంబ మొదట తిని ఏం మాట్లాడలేకపోతుంది అంత రుచిగా ఉందా పిన్ని అని ఐశ్వర్య కూడా తింటుంది. ఇద్దరు ఏం మాట్లాడలేకపోతారు. నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని నందు అనగానే ఐశ్వర్య కోపంగా చూస్తుంది. మీకు ముందే చెప్పాను కదా.. మీ పనులు మీరు చేసుకోండి అని నందు కోప్పడుతుంది. మరొకవైపు రాజు గదిలోకి రా అని ఇందు అనగానే చలపతి, లక్ష్మీ ఆశ్చర్యంగా చూస్తారు. ఎహ్ ఎందుకని రాజు అనగానే కట్టు విప్పి మళ్ళీ కట్టడానికి అని ఇందు అనగానే అందుకా అని చలపతి అంటాడు. ఆ తర్వాత నేను రానని రాజు అనగానే ఇంకొక కాలు పని చెయ్యకుండా చేస్తాను.. అప్పుడు సెటిల్ అవుతావని ఇందు అనగానే అబ్బా ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది.. నా కొడుకుకి తగ్గట్టు ఉందని చలపతి హ్యాపీగా ఫీల్ అవుతాడు.

ఆ తర్వాత ఇందు నిజంగానే కొడుతుందేమోనని రాజు అనుకొని లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత రాజు కాలికి ఇందు మసాజ్ చేస్తుంది. ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావ్.. నేను నీకు అద్దె మొగుడు మాత్రమే.. నిజంగా మొగుడు అయినట్లు చేస్తున్నావ్.. నువ్వు ఏం చేసినా ఆ ఇంటికి రానని ఇందుతో  రాజు అంటాడు. నువ్వు ఏం చేసినా నువ్వు లేకుండా ఉండలేను బావ అని ఇందు అనగానే నువ్వు ఇలా మాట్లాడుతుంటే మా వాళ్ళు మీకు పెళ్లి అయింది కదా ఇంకా ఆ తంతు కాలేదని జరిపిస్తారని రాజు అంటాడు. తరువాయి భాగంలో రాజు దగ్గరికి ఇందు పాల గ్లాస్ తో వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com