Home

»

Tv News

Brahmamudi : రేఖకు రాజు మైండ్ బ్లోయింగ్ వార్నింగ్.. ఇందు ప్రేమ ప్రకటన!

Jul 17, 2026 10:53AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1086 లో.... భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో రాజుతో చలపతి చెప్తాడు. మీరు మాట్లాడుకోండి మేం వెళ్లిపోతున్నానని చలపతి లక్ష్మీ అక్కడ నుంచి వెళ్తారు. రాజు లోపలికి వెళ్తూ పడిపోబోతుంటే అప్పుడే ఇందు వచ్చి పట్టుకుంటుంది‌. నన్ను వదిలిపెట్టమని రాజు అనగానే వదిలేస్తే పడిపోతావని ఇందు అంటుంది.

అంతలోనే రేఖ రావడం వాళ్ళిద్దరు గమనిస్తారు. రాజుని చూసి రేఖ షాక్ అవుతుంది. ఇంకా వీడు బ్రతికే ఉన్నాడా అని అనుకుంటుంది. అతని దగ్గరికి వచ్చి నువ్వు ఏంటి ఇక్కడ అని ఇందుని అడుగుతుంది. ఎంతైనా మొగుడిని కదా అందుకే వచ్చింది అని రాజు అంటాడు. ఏంటి పిన్ని ఇంకా చావలేదని షాక్ అవుతున్నావా.. ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు అని రాజు అంటాడు. ఇందు నువ్వు వెళ్లి కాఫీ తీసుకొనిరా అని రాజు తనని పంపిస్తాడు. లక్కీ గాడి గురించి ఎక్కడ నిజం చెప్పేస్తానోనని ఇదంతా చేసావ్ కదా కానీ నీకు తెలియని విషయం ఏంటంటే లక్కీ కన్నతల్లివి నువ్వే అన్న విషయాన్ని  నేను వేరొకరికి చెప్పి ఉంచాను. నాకు ఏమైనా అయితే మరుక్షణం వాళ్ళు నిజం చెప్పేస్తారని రాజు అనగానే రేఖ భయపడుతుంది. అప్పుడే ఇందు వస్తుంది. ఇందుని పక్కకి తీసుకొని వెళ్లి ఏంటి నువ్వు ఇక్కడ అని రేఖ అడుగుతుంది.  మీ గురించే ఆంటీ.. మీరే ఇదంతా చేశారనుకుంటున్నారు.. ఆ ఆలోచన పోవాలని నేను వచ్చానని ఇందు అంటుంది. దాంతో రేఖ కూడా ఏమనలేకపోతుంది.

మరొకవైపు భ్రమరాంబ, ఐశ్వర్య టిఫిన్ చేస్తూ ఇదొక టిఫిన్ ఆ అని అపర్ణపై కోప్పడతారు. అప్పుడే నందు వస్తుంది. అవును నానమ్మ నీకు వంటలు చెయ్యరాదు.. అందుకే రేపటి నుంచి నేను చేస్తానని నందు అనగానే శేషు షాక్ అవుతాడు. ఏంటండీ మీరు తను ఆడపిల్ల కదా ఏంటని భ్రమరాంబ అంటుంది. తరువాయి భాగంలో రాజు కాళ్ళు ఇందు నొక్కుతుంది. నేనేం చేసినా మీ ఇంటికి అయితే రానని రాజు అనగానే నువ్వు లేకుండా ఉండలేను బావ అని ఇందు అనగానే రాజు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com