Home

»

Tv News

Brahmamudi : డబ్బు కోసం రాజు కష్టాలు.. ఇందు సెంటిమెంట్ చైన్‌తో హాస్పిటల్ బిల్ పేమెంట్!

May 29, 2026 10:16AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1044 లో ..రాజు దగ్గరికి శేషు వస్తాడు. అతను కాబోయే సీఈఓ కదా అతనితో మంచిగా ఉండాలనుకొని అల్లుడు నువ్వు సీఈఓ అయితే బాగుంటుంది.. ఆ రేఖకి హాఫ్ నాలెడ్జ్ అని శేషు అంటాడు. నువ్వు సీఈఓ అయితే నీకు అసిస్టెంట్ గా ఉంటానని శేషు అంటాడు. ఆ తర్వాత రాజుకి డాక్టర్ ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు గంటలో డబ్బు కట్టకపోతే ట్రీట్ మెంట్ ఆపేస్తామని డాక్టర్ చెప్పగానే రాజుకి టెన్షన్ మొదలవుతుంది.

ఆ తర్వాత ఇందు దగ్గరికి రాజు వచ్చి.. నా పేమెంట్ నాకు ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు లేవని ఇందు అంటుంది. జోక్ చెయ్యకు నాకు ఇప్పుడు డబ్బు అర్జంట్ అవసరం.. ఇన్ని పనులు చేసేది నా అవసరం కోసం మాత్రమే ప్లీజ్ అర్ధం చేసుకో నీకు దండం పెడతాను కాళ్ళు మొక్కుతానని రాజు రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు లేవని ఇందు అంటుంది. ఇప్పుడు కనుక నువ్వు డబ్బు ఇవ్వకపోతే నేను ఇక నువ్వు చెప్పినట్లు వినను అని రాజు అనగానే ఇందుకి వేరే మార్గం లేక తనకి ఇష్టమైన వాళ్ళ అమ్మ గుర్తు అయినటువంటి చైన్ ని రాజు కి ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొమని చెప్తుంది. దాంతో రాజు అది తీసుకొని వెళ్తాడు. ఒక నగల షాప్ లో తాకట్టు పెడుతాడు. నేను యాభై వేలు మాత్రమే ఇస్తానని అతను చెప్తాడు. అప్పుడు డాక్టర్ ఫోన్ చేసి నీకు ఇచ్చిన గంట టైమ్ అయిపోయిందని అనగానే వస్తున్నా డాక్టర్ అని సేట్ ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్లి హాస్పిటల్ లో పే చేస్తాడు రాజు. రాజు దూరం నుంచి తను ట్రీట్మెంట్ చేస్తున్న పేషేంట్ ని చూస్తూ.. మీకు ఏం కాదు మీకు ఇచ్చిన మాట తప్పనని రాజు అనుకుంటాడు. మరొక వైపు వెంకీ ఇంటర్వ్యూకి వెళ్తాడు. వెళ్లిన చోట AI నేర్చుకున్నావా అప్డేట్ లో ఉన్నావా అంటూ అడుగుతారు. దాంతో వెంకీకి కోపం వస్తుంది.

మరోవైపు రాజు హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు ఇందు వచ్చి నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా అని అడుగుతుంది. కొంతవరకు సాల్వ్ అయిందిని రాజు చెప్తాడు. ఏంటి అంత అర్జెంట్ అని ఇందు అడుగుతుంది. ఏంటి నువ్వు సొంత పెళ్ళాం అడిగినట్లు అడుగుతున్నావని రాజు కోప్పడతాడు. అప్పుడే అపర్ణ వచ్చి ఏమైంది బాబు అని అడుగుతుంది. తరువాయి భాగంలో తాకట్టు పెట్టిన చైన్ ఇందు వాళ్ళ అమ్మ గుర్తు అని తెలుసుకున్న రాజు.. దానిని తాకట్టు నుంచి విడిపించి ఇందుకి ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com