మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం
on Jun 14, 2025
బుల్లితెర మీద శివ్ కుమార్ - ప్రియాంక జైన్ ఇద్దరూ ఇంతమంచి స్నేహితులో అందరికీ తెలుసు. అలాంటి శివ్ పుట్టినరోజును పరి స్పెషల్ గా ప్లాన్ చేసింది. అలాగే ఇంకో సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. శివ్ ని అండమాన్ తీసుకెళ్లింది పరి. శివ్ ఐతే చాలా ఎక్సయిట్ అయ్యాడు. అలాగే అతనికోసం ఒక రింగ్ కూడా కొన్నది పరి. 2025 జూన్ లో టేకాఫ్ అయ్యాం అదే 2050 ఇయర్ లో ల్యాండ్ ఐతే ఎలా ఉంటుంది అంటూ వింతైన ప్రశ్న అడిగింది పరి. చాలా బాగుంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు శివ్. సముద్రం మీద ఫ్లయిట్ లో వెళ్తూ డ్రై ఫ్రూప్ట్స్ తో తయారు చేసిన కేక్ ని ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చి ఇచ్చేసరికి శివ్ కట్ చేసి టేస్ట్ చేసాడు. అలాగే క్రోజ్ లో హావలోక్ అనే ఐలాండ్ కి తీసుకెళ్లి అక్కడ 150 ఏళ్ళ వయసున్న పెద్ద వృక్షాన్ని చూపించింది. ఇక అక్కడ ఒక పెద్ద సెటప్ వేయించింది.
శివ్ ని బయట పెట్టి కళ్ళకు గంతలు కట్టి ఆ సెటప్ దగ్గరకు తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చుని రింగ్ ఇచ్చి "విల్ యు మ్యారి మీ" అని అడిగింది. ఇక శివ్ ఐతే తెగ సిగ్గుపడిపోయాడు. ఫైనల్లీ డ్రీం కం ట్రూ ప్రపోజల్ చేసావ్ అంటూ హగ్ చేసుకుని ఐ లవ్ యు అని చెప్పాడు. "సరే నువ్వు లైఫ్ లాంగ్ ఇలా ఉండడానికి రెడీగా ఉన్నావా" అని అడిగింది పరి. "లైఫ్ లాంగ్ ఏంటే ఏడేడు జన్మలు ఇలా ఉండడానికి రెడీగా ఉన్నా" అని చెప్పాడు శివ్. "29 వ బర్త్ డే చేసింది ప్రియాంక ఎప్పుడూ ఇంత మంచి సర్ప్రైజ్ ఇవ్వలేదు..ప్రియాంక మదర్ ఆఫ్ సర్ప్రైజెస్ ..మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం" అని చెప్పుకొచ్చాడు శివ్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
