Home

»

Tv News

Illu illalu pillalu : వల్లికి అత్తగారి షాక్.. చందు దూరం పెట్టడంతో మారిన సీన్!

Jul 10, 2026 10:57AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -519లో.... నర్మద దగ్గరికి వేదవతి వచ్చి నిజం తెలియకుండా నీపై చెయ్ చేసుకున్నాను.. సారీ అని వేదవతి చెప్తుంది. అయిన నా మాట ఎందుకు వింటారని నర్మద వెటకారంగా మాట్లాడుతుంది కానీ ఇద్దరు మళ్ళీ మాములుగా అయిపోతారు. నర్మద, వేదవతి సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత చాప దిండుపట్టుకొని చందు బయటకి వెళ్తుంటే వల్లి అడ్డుపడుతుంది. బా నేను చెప్పేది విను అంటుంది. మా అమ్మ చెప్పడం వల్లే ఇదంతా చేసానని అంటుంది.

ఇంకా నువ్వు చిన్నపిల్లవా ఒకటా.. రెండా నువ్వు చేసే తప్పులు అని చందు కోప్పడతాడు. నువ్వు నన్ను దూరం పెట్టకు బా అని వల్లి ఏడుస్తుంది. ఆల్రెడీ నా మనసు నుంచి దూరం అయ్యావ్.. పేరుకే భార్యాభర్తలం మనకి ఒక అడ్డుగీత ఉంటుంది. నేను అసలు పెళ్లి వద్దన్నా.. మా నాన్న గురించి చేసుకున్నాను.. నిన్ను ఏదో ఉత్తమ కోడలు అనుకుంటున్నాడని వల్లిపై చందు సీరియస్ అవుతాడు. దాంతో వల్లి ఏడుస్తుంది. ఆ తర్వాత ప్రేమ డల్ గా ఉంటుంది. ధీరజ్ వెళ్లి నువ్వు సొంత అన్నయ్య అయినా కూడా శిక్ష పడాలనుకుంటున్నావు.. నువ్వు గ్రేట్ అని ప్రేమని ధీరజ్  దగ్గరికి తీసుకుంటాడు. నేను రేపు కోర్ట్ కి వస్తానని ప్రేమ అంటుంది. వద్దు మీ నాన్న రేపు ఏదైనా తింగరిపనులు చేస్తే నువ్వు తట్టుకోలేవని ధీరజ్ అంటాడు. మరొకవైపు ఇంటికి పక్కింటి వాళ్ళు పసుపు, కుంకుమ ఇవ్వడానికి వస్తారు. వేదవతి వాళ్ళతో మాట్లాడుతుంది. ఇంటి పెద్దకోడలు అని వల్లికి ఇవ్వబోతుంటే వేదవతి వద్దని చెప్పి నర్మదకి ఇప్పిస్తుంది. బొట్టు కూడా నర్మద, ప్రేమలకి పెట్టి వల్లికి పెట్టదు. ఆ తర్వాత వేదవతి దగ్గరికి వల్లి వెళ్లి మాట్లాడుతుంది.

అత్తయ్య నన్ను క్షమించండి అని తన కాళ్లపై పడుతుంది వల్లి. నిన్ను ఒక కూతురులాగా చూసుకున్నాను..ఇంత మోసం చేసావని వేదవతి వల్లిని తిడుతూ.. నిన్ను ఎప్పటికీ క్షమించనని చెప్తుంది.. ఆ తర్వాత నర్మద, ప్రేమ వర్షంలో బట్టలు తీస్తుంటే జలుబు అవుతుందని వాళ్ళ ఇద్దరికి వేదవతి గొడుగుపడుతుంది. అదంతా వల్లి చూసి కోపంతో ఊగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com