Home

»

Tv News

Illu illalu pillalu : ఇంటి నుండి వెళ్ళిపోయిన సాగర్, నర్మద.. ధీరజ్ తీసుకొస్తాడా!

Mar 04, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -409 లో...... నర్మదని వేదవతి కొట్టగానే అందరు షాక్ అవుతారు. నా భార్య ఏం తప్పు చేసిందని కొడుతున్నారు.. ఈ జాబ్ ఆలోచన నాది.... ఒకవేళ తనే చెప్పింది అనుకో.. అది తప్పా.. భర్త జాబ్ చెయ్యాలి భార్య తప్పేలా అవుతుందని సాగర్ అంటాడు. ఏంట్రా పెళ్ళాం వచ్చాక మొత్తం మారిపోయావని వేదవతి అంటుంది. అమ్మ ఎంతసేపు మీ వాదన మీకేనా అని సాగర్ కోప్పడతాడు. తండ్రి గా మీరు అన్ని ఇచ్చారు అనుకుంటారు కానీ మాకు నచ్చింది మాత్రం చెయ్యనివ్వరని సాగర్ అంటాడు. ఎంట్రా నాన్నకి ఎదురు మాట్లాడుతున్నావని చందు అంటాడు. నీలాగా నేను చెయ్యలేనురా అని సాగర్ అంటాడు. అన్నయ్యకి నాన్నకి ఎదురు మాట్లాడతావ అని ధీరజ్ అనగానే నీకు నచ్చింది చేస్తావ్ కదరా.. నువ్వు చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే ఎదురు తిరగడమా అని సాగర్ అంటాడు. మీరు జాబ్ వద్దని అంటున్నారు.. నేను చేస్తానని అంటున్నాను.. ఇక నేను ఈ ఇంట్లో ఉండనని సాగర్ అంటాడు. సాగర్ ఏం మాట్లాడుతున్నావని నర్మద అంటుంది.

ఆ తర్వాత భాగ్యం, భద్రవతికి ఫోన్ చేస్తుంది. నీకు సంతోషం కలిగే విషయం ఉంది. బాల్కనీలోకి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత నా భార్యకి నాకు విలువ లేని చోట నేను అసలు ఉండనని గదిలోకి వెళ్లి సాగర్ బట్టలు సర్దుతాడు. నీ నిర్ణయం తప్పు సాగర్ అని నర్మద అంటుంది. నాతో కలిసి బతకాలని ఉంటే నాతో పాటు రా అని సాగర్ అనగానే తప్పక నర్మద కూడా సాగర్ వెంట వెళ్తుంది.

వేదవతి వాళ్లు వద్దని అడ్డుచెప్తారు. అయిన వినకుండా వెళ్తారు. వాళ్ళు వెళ్లడం భద్రవతి వాళ్ళు పైనుండి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నర్మద వాళ్ళ పుట్టింటికి సాగర్ తీసుకెళ్తుంటే.. నేను రానని నర్మద అంటుంది. దాంతో రెంట్ కి ఇల్లు కావాలని తన ఫ్రెండ్ కి సాగర్ ఫోన్ చేస్తాడు. మరొకవైపు అన్నయ్య వదినని తీసుకొని వస్తానని ధీరజ్ వెళ్తుంటాడు. ప్రేమ తనతో పాటు వెళ్తుంది. నర్మద, సాగర్ ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు భాగ్యం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నర్మద, సాగర్ దగ్గరికి ప్రేమ, ధీరజ్ వెళ్లి నచ్చజెప్పి ఇంటికి తిరిగి రావడానికి ఒప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com