.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -173 లో... మాధవని చూడడానికి అమ్మాయి వాళ్ళు వస్తారు. అప్పుడే పంతులు గారు కూడా వస్తాడు. ఏంటి ఈ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదని అమ్మాయి వాళ్ళ నాన్న అంటాడు. అదేం లేదండి ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని నారాయణ చెప్తాడు. అబ్బాయి జాతకం ఒకసారి ఇవ్వండి అని పంతులు చెప్తాడు. ఈ జాతకం లో అబ్బాయికి పెళ్లి లేదు.. పైగా ఇతను ఉన్న ఇంట్లో అసలు పెళ్లిళ్లు కావు.. ఇతని జాతకం పక్క వాళ్ళని ప్రభావితం చేస్తుందని పంతులు చెప్తాడు. దాంతో మాధవ షాక్ అవుతాడు.
ఇలాంటి జాతక దోషం ఉన్న అతనికి మా అమ్మాయిని ఇవ్వలేనని అమ్మాయి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంటికి వస్తామంటే ఇల్లు చూస్తారనుకున్న కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని మహా అంటుంది.ఆ తర్వాత మాధవ గదిలోకి వెళ్లి బాధపడుతాడు. మహా బయటకు పిలిచి కాఫీ ఇస్తుంది. పెద్ది మీరు బయటే కూర్చోండి అని మహా అంటుంది. తనని బాధపడొద్దని చెప్తుంది. ఇప్పుడు అంతా చూస్తుంటే నా పుట్టుక వ్యర్థం అనిపిస్తుందని మాధవ బాధపడతాడు
ఆ తర్వాత అందరు పడుకున్నాక మాధవ లేచి ఈ ఇంట్లో ఉండొద్దని అనుకుంటాడు.. వీళ్ళు అయిన బాగుండాలని మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మాధవ ఇంట్లో కనిపించకపోవడంతో అంతా వెతుకుతారు. అప్పుడే గదిలో మాధవ రాసిన లెటర్ చూస్తారు. అందులో నేను వెళ్లిపోతున్నా.. నా గురించి వెతకొద్దని ఉంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. అందరు ఒక్కొక్కవైపు వెళ్ళి వెతుకుతారు. తరువాయి భాగంలో మాధవ గురించి చక్రి, మహా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
