ఆంటీ అన్న అంకుల్...గదిలో ఏడ్చిన పవిత్ర
on Jan 23, 2026

ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ కి మాటలుండవ్ కానీ బాగా కనెక్ట్ అవుతాయి. అలాంటి ఒక రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే పాగల్ పవిత్ర చేసిన రీల్. అందులో పవిత్ర ఏడుస్తూ కనిపించింది. నిండుగా చీర కట్టుకుని ఎందుకు ఏడుస్తుందా అనుకుంటారు చూసినవాళ్లెవరైనా. కానీ కింద కాప్షన్ చూస్తే మాత్రం కడుపుబ్బా నవ్వుకుంటారు. ఇంతకు ఎందుకు ఏడ్చింది అంటే "వెన్ పక్కింటి అంకుల్ కాల్స్ మీ ఆంటీ" అంటూ ఒక ఏడ్చే ఎమోజిని పోస్ట్ చేసింది. "ఒక్క పదం..అన్ లిమిటెడ్ ట్రామా" అంటూ పెట్టి మరీ బాధపడుతోంది. ఆ కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా తన గదిలోకి వచ్చి మరీ ఏడ్చింది.
ఇక ఆ రీల్ కి ఆర్జే చైతు ఐతే నవ్వే ఎమోజిఎస్ పెట్టాడు. ప్రియాంక సింగ్ ఏమో "ఓకే ఆంటీ యు లుక్ చొ చ్వీట్" అంది. కిర్రాక్ సీత ఐతే "అట్లా రెడీ ఐతే ఆంటీ కాకా ఇంకేం అనాలి" అంటూ అడిగింది. అరియనా ఐతే "ఆంటీ" అని కామెంట్ పెట్టి మళ్ళీ ఏడిపించింది. జ్యోతిరాజ్ సందీప్ ఐతే "నువ్వు నీ వేషాలు" అంటూ పెట్టింది. ఇక మిగతా నెటిజన్స్ అంతా "ఊరుకోండి ఏడవద్దు" అంటూ నవ్వే ఎమోజిస్ ని పోస్ట్ చేశారు. పవిత్ర జబర్దస్త్ లో కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటుంది. అలాగే అన్ని షోస్, ఈవెంట్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా రీల్స్ అప్లోడ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మంచి కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



