.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ ఎలిమినేషన్ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో రోహిత్ బయటకు వెళ్లిపోయి వారం గడిచినా.. ఫ్యాన్స్ మాత్రం అతడు మళ్లీ హౌస్‌లోకి వస్తాడని ఎదురుచూస్తూనే ఉన్నారు. గత వీకెండ్ ఎపిసోడ్‌లో రోహిత్ రీ-ఎంట్రీ ఉంటుందని అందరూ గట్టిగా నమ్మారు. సోషల్ మీడియాలో #BringBackRohitBB10 అంటూ పెద్ద క్యాంపెయిన్ కూడా నడిచింది. చరణ్, షాలినీకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టే రోహిత్‌కు కూడా ఇస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు.
కానీ పదోవారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. అందరి ఫ్యామిలీస్ హౌస్ లోకి రావడంతో కంటెస్టెంట్స్ ఎమోషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. మరి ఈ టైమ్ లో రోహిత్ ని హౌస్ లోకి ఎలా పంపిస్తారు. అతడి ఆశలన్నీ ఇప్పుడు ఆవిరయ్యాయా అంటే కాదని రోహిత్ టీమ్ స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్ మళ్లీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తాడని కన్ఫర్మ్ చేసింది. అసలు రోహిత్ ఎలిమినేషన్ సమయంలోనే నాగార్జున సీక్రెట్ రూమ్ ఆఫర్ ఇచ్చినా.. రోహిత్ దాన్ని తిరస్కరించాడని టాక్ వచ్చింది. ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పి బయటకు వచ్చేశాడని ప్రచారం జరిగింది. అభిజీత్ వేసిన "The Sun Will Shine Again" అనే క్రిప్టిక్ పోస్ట్ కూడా రీ-ఎంట్రీ హోప్స్ పెంచింది. కానీ ఇప్పుడు అవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోతాయా లేక రోహిత్ ఎంట్రీ ఇస్తాడా అనే క్లారిటీ ఇంకా రాలేదు.
ఇక పదో వారం ఫ్యామిలీ వీక్ సాగుతోంది. గత వారం దీపావళి స్పెషల్ కారణంగా ఎలిమినేషన్ లేదు. ఈ వారం ముఖేష్, వర్షిణి, శివ, రామకృష్ణ, సుధీర్ , దేబ్జానీ, త్రిగుణ్, సుధీర్ ఇలా అందరు నామినేషన్‌లో ఉన్నారు. రోహిత్ లేకపోవడంతో టైటిల్ రేస్ ఇప్పుడు ముఖేష్, త్రిగుణ్ మధ్యనే నడుస్తోంది. రోహిత్ రీ-ఎంట్రీ ఉందా లేదా అని ఫ్యాన్స్ డైలమాలో ఉన్నారు. మరి బిగ్ బాస్ టీం ముందు ముందు ఏదైనా ట్విస్ట్‌తో రోహిత్‌ను తీసుకొస్తారా లేదా ఈ సీజన్‌కు రోహిత్ చాప్టర్ పూర్తిగా క్లోజ్ అయిపోయిందా అనేది చూడాలి మరి. అయితే మెజారిటీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్-10 ఆడియన్స్ రోహిత్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.






