న్యూస్ రీడర్ గా నవ్యస్వామి
on Jun 23, 2022
ప్రతీ వారం ఢీ-14 కొత్త కొత్త డాన్స్ స్టైల్స్ తో దుమ్ము రేపుతోంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ప్రియమణి, ప్రదీప్ , జానీ మాస్టర్, హైపర్ ఆది యాజ్ యూజువల్ గా వచ్చేసారు. ఇక అప్పుడే నిఖిల్ ఒక రష్యా అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చి "అది చెట్టు, ఇది మెట్టు" అంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ ని చూపించి ఆది "ఇతను లఫుట్టూ" అంటూ కామెడీ చేస్తాడు. అమ్మాయిల్ని చూస్తే చాలు వెంటబడతాడు అన్న విషయం అందరికీ తెలిసింది. ఇక్కడ కూడా అదే ఫాలో అయ్యాడు "అనెస్థీషియా నీకో గులాబీ పువ్వు తీసుకొచ్చి ఇద్దామనుకుంటున్నాను అంటాడు" ఆ రష్యన్ అమ్మాయితో. "ఎవరికీ వద్దు పోరా" అంటూ రష్యన్ స్లాంగ్ తెలుగులో ఆదిని స్వీట్ గా తిడుతుంది. వావ్ అంటూ ప్రదీప్ సహా అందరూ క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తారు. ఇక జతిన్ "కెవ్వు కేక " సాంగ్ కి ఒక అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి స్టేజి మీద ఫైర్ పుట్టించి అందరినీ హీటెక్కించేసాడు. నవ్యస్వామి న్యూస్ రీడర్ అవతారం ఎత్తుతుంది. నిఖిల్ ఆన్ ఫీల్డ్ లోరిపోర్టర్ గా చేస్తాడు. ఆది,రష్యన్ అమ్మాయి ఇద్దరు భార్య భర్తలుగా చేస్తారు.
కెమెరామాన్ గా రవికృష్ణ చేస్తాడు. "ఇప్పుడే అందిన తాజా వార్త. నడి రోడ్డు మీద ఒక భర్త , భార్య కొట్టుకుంటున్నారట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ రిపోర్టర్ నిఖిల్ అందిస్తాడు " అంటుంది నవ్య. " సర్ ఇక్కడేం జరిగిందని మా ప్రేక్షకులు" అంటూ నిఖిల్ తెలుగులో చెప్పలేక తడబడేసరికి ఆది అందుకుని "ఈమెను నేనేమీ చేయలేదండి ఈమె నా మీద అరుస్తుంది" అంటాడు. రవికృష్ణ కెమెరాని ఆ అమ్మాయి వైపు పెట్టేసరికి తననేమి చేయొద్దు అన్నట్టుగా రకరకాల రష్యన్ ఎక్సప్రెషన్స్ ఇచ్చి మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది ఆ రష్యన్ బేబీ . బాబోయ్ ఈమె అపరిచితురాలు అంటూ ఆది భయపడతాడు. తర్వాత చెర్రీ , హేమాంక్ష్ జోడి బ్లాక్ డ్రెస్ లో "రా రా నా వీర " అనే సాంగ్ కి మంచి హాట్ పెర్ఫార్మన్స్ చేసేసరికి ఆది చూపులు తిప్పుకోకుండా తర్వాత ఏం జరుగుద్ది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు.
ఇక ఒక ఫ్రిడ్జ్ లో ఈ జోడి రొమాన్స్ చేసే డాన్స్ బిట్ చేస్తారు. ఫైనల్ గా సాంగ్ ఐపోయాక "ఆది ఇప్పుడు నాకు అర్ధమయ్యింది ఏమిటి అంటే ఒక పెద్ద ఫ్రిజ్ ని అర్జెంటుగా కొని ఇంట్లో పెట్టుకోవాలి" అంటూ ఒక కుళ్ళు డైలాగ్ వేస్తాడు జానీ మాస్టర్. "మీరు ఫ్రిజ్ ని ఇంట్లో కాదు వాన్ లో వేసుకుని దేశం మొత్తం తిరిగేస్తారు" అంటూ పంచ్ వేస్తాడు. దయచేసి నాదో రిక్వెస్ట్ "మీ ఫ్రిజ్ లో నాకు కొంచెం చోటివ్వండి" అంటూ మరో చెత్త కౌంటర్ వేస్తాడు ఆది. ఇంకా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. నెటిజన్స్ మాత్రం కామెంట్స్ తో ఈ షోని తిట్టిపోస్తున్నారు. డాన్స్ కన్నా చెత్త కామెడీ ఎక్కువైంది ..కక్కుర్తి మొహం వేసుకుని చూస్తున్న ఆది అంటూ పిచ్చ తిట్లు తిడుతున్నారు.