Home

»

Tv News

 శ్రీ‌ముఖి దెబ్బ‌కి స్పృహ కోల్పోయిన నాగ‌బాబు

Nov 30, 2021 1:24PM

ఆర‌డుగుల అజానుభావుడు నాగ‌బాబు ఉన్న‌ట్టుండి స్పృహ కోల్పోయారు. ఆయ‌న‌కు ఏం జ‌రిగింది?.. ఎందుకు స్పృహ కోల్పోయార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే... మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఉన్న‌ట్టుండి స్పృహ కోల్పోవ‌డానికి కార‌ణం శ్రీ‌ముఖి అని తెలిసింది. బుల్లితెర స్టార్ యాంక‌ర్ శ్రీ‌ముఖి, మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇటీవ‌ల ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్క‌డే ఈ వింత చోటు చేసుకుంది.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. షూటింగ్ గ్యాప్‌లో ఖాలీ స‌మ‌యం చిక్క‌డంతో శ్రీ‌ముఖి, నాగ‌బాబు ఇద్ద‌రూ ఓ చోట చేరారు. అయితే నాగ‌బాబు స‌ర‌దాగా ఓ పాట పాడొచ్చుక‌దా అని రిక్వెస్ట్ చేశాడు. ఇదే అద‌ను కోసం ఎదురుచూస్తున్న శ్రీ‌ముఖి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. త‌న గాన ప్రావీణాన్ని అంతా ఒక్క‌సారిగా చూపించేసింది. గొంతు స‌వ‌రించి పాటందుకుంది. శ్రీ‌ముఖి పాట‌ని త‌ట్టుకోలేక ప‌క్క‌నే వున్న నాగ‌బాబు ఉన్న‌ట్టుండి స్పృహ కోల్పోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇందులో ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ ఇలా వుంది
నాగ‌బాబు : శ్రీ‌ముఖి నిన్ను ఎప్ప‌టి నుంచో ఒక‌టి అడ‌గాల‌ని అనుకుంటున్నా...
శ్రీ‌ముఖి : అడ‌గండి బాబుగారు
నాగ‌బాబు : నీ నోటి నుంచి చ‌క్క‌టి పాట‌ని వినాల‌ని వుంది.
శ్రీ‌ముఖి : త‌ప్ప‌కుండా బాబుగారు  మ‌రి రెడీయా! అని ఒక్క‌సారిగా `ద‌ర్ ద‌ర్ బాద్ తుకుడే..` అంటూ పాటందుకుంది. శ్రీ‌ముఖి అరుపుల‌కు కేక‌ల‌కు నాగ‌బాబు దెబ్బ‌కు స్పృహ కోల్పోయాడు. నెట్టింట న‌వ్వులు పూయిస్తున్న ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com