
బిగ్ బాస్ సీజన్-10 లో నామినేషన్లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా గొడవ పడ్డారు. అందులో ముఖేష్-దేబ్జానీ మధ్య నామినేషన్ ప్రక్రియ ఎమోషనల్ గా సాగింది. దేబ్జానీ వెనుకాల శివ్ పడుతున్నాడని చెప్పడంతో దేబ్జానీ దానిని తీసుకోలేపోయింది.
తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముఖేష్ ని దేబ్జానీ నామినేషన్ చేసింది. ముఖేష్ గతంలో చేసిన కామెంట్స్ తో దేబ్జానీ తీవ్రంగా హర్ట్ అయినట్లు ఇందులో కనిపించింది. దేబ్జానీ వెనుక శివ తిరుగుతున్నాడనే అర్థం వచ్చేలా ముఖేష్ మాట్లాడటంపై శివ్ నామినేట్ చేస్తూనే ఫైర్ అయ్యాడు. ఒక మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. గేమ్‌లో మూడు స్టార్ల కోసం ఇంతలా దిగజారాలా అంటూ నిలదీశాడు.
దేబ్జానీ సైతం ముకేష్ ప్రవర్తనను తప్పుబట్టింది. టాస్కుల్లో వేగం, బ్యాలెన్స్ కంటే వ్యక్తిత్వం, ప్రవర్తన ముఖ్యమని చెప్పింది. ముకేష్‌ను డర్టీ మైండ్, అనర్హుడు అంటూ నామినేట్ చేసింది. అతడి మాటలకు బాధపడిన ఆమె చివరకు 'ఐ పిటీ ఆన్ యూ ముకేష్' అంటూ భావోద్వేగానికి గురైంది.రోజురోజుకి ముఖేష్ ప్రవర్తన చాలా దారుణంగా సాగుతుంది. మరి వీకెండ్ లో ముఖేష్ కి నాగార్జున కోటింగ్ ఇస్తాడా లేదా చూడాలి మరి.




.webp)
.webp)
