Home

»

Tv News

చూడడానికి ఎదవలా కనపడినా చాలా మంచోడు... నిఖిల్ తో మోనీషా

Jul 30, 2026 10:39AM

 కుకు విత్  జాతిరత్నాలు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ థీమ్ తో ఈ లేటెస్ట్ ఎపిసోడ్ రాబోతోంది. ఈ ప్రోమోలో ఫ్రెండ్స్ వచ్చిన వాళ్లంతా ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టుకుని వాళ్ళ వాళ్ళ గురించి చెప్పారు. పల్లవి గౌడ ఐతే "నిజానికి మీ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగినప్పుడు ఎవరున్నారు అని ఆలోచించాను. నేను చాలా బ్యాడ్ కూడా ఆ టైములో ఫీలయ్యాను. ఎందుకంటే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు అని " అంటూ ఫీలయ్యింది.

తర్వాత స్నో అక్క మోనిష వచ్చి నిఖిల్ విజయేంద్ర సింహ గురించి చెప్పుకొచ్చింది. "ఇతను ఒక సెల్ఫ్ లెస్ పర్సన్.  చాలా మంచి అబ్బాయి.. అక్కడెక్కడో స్నో పడిందట నేనొచ్చి ఇక్కడ పడ్డాను. చూడడానికి ఎదవలా కనపడినా చాలా మంచి కోతి జాతిరత్నం " అని చెప్పేసరికి ప్రదీప్ జాతిరత్నం కాదు కుకు అంటూ కరెక్ట్ చేసాడు. ఇక దీపికా పాప్ కార్న్ గెటప్ తో వచ్చింది. "ఈ రోజు మీరు పాప్ కార్న్ ని ఎన్ని రకాలుగా చూడొచ్చో అన్ని రకాలుగా చూడోచ్చు " అంటూ ప్రదీప్ నోట్లోకి ఒక పాప్ కార్న్ ని విసిరింది. "నేను పాప్ కార్న్ సైలెంట్ గా ఉంటే చూడాలనుకుంటున్న " అంటూ పక్క నుంచి డీమన్ పవన్ కౌంటర్ వేసాడు.

ఇమ్మానుయేల్ ఒక గ్లాస్ గెటప్ వేసుకొచ్చి "ఫ్రెండ్ షిప్ అంటేనే మనం మనం అంటేనే ఫ్రెండ్ షిప్ " అనేసరికి నిఖిల్ వచ్చి చీర్స్ కొట్టాడు. హరి ఐతే బైక్ గెటప్ తో వచ్చాడు. "యాంకర్ కి ఎమోషన్ పెట్టుకునే మైక్ ఫ్రెండ్స్ కి ఎమోషన్ వాళ్ళు కలిసి తిరిగే బైక్ " అని చెప్పాడు. రీతూ క్యారేజ్ గెటప్ తో వచ్చింది. "అసలైన మనకున్న చిల్లర  ఫ్రెండ్స్ అందరూ కనిపించేదే ఈ లంచ్ బాక్స్ వల్ల   " అని చెప్పుకొచ్చింది. తర్వాత వాళ్లకు టాస్కులు ఇచ్చారు. బొమ్మను చూపిస్తే కలర్ క్లే తో దాన్ని తయారు చేస్తే వాటిని గుర్తుపట్టాలని చెప్పారు. ఇలా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ రాబోతోంది.
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com