Home

»

Tv News

Podharillu : కన్నాని చితక్కొట్టిన మహా.. మాధవ పాదాలపై పడి క్షమాపణలు!

May 05, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -106 లో.......కన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని అందరు వెతుకుతారు. కన్నా ఒక దగ్గర ఏడుస్తూ కన్పిస్తాడు. చక్రి చూసి మాధవకి చెప్తాడు. కన్నాని చూసి మాధవ ఎమోషనల్ అవుతాడు. చూసిన వెంటనే ఇప్పటికి వరకు తను అనుభవించిన బాధతో కుప్పకూలుతాడు. కన్నా దగ్గరికి చక్రి వెళ్తాడు. ఎందుకు ఇలా చేసావ్ రా.. ఆ ఇల్లు ఇప్పుడు నచ్చడం లేదా.. మమ్మల్ని ఇలా విడిచి ఎలా వెళ్ళాలనిపించిందని చక్రి అడుగుతాడు.

పాపం పెద్ద అన్నయ్య.. నువ్వు కనపడకుంటే ఏమైపోతాడనుకున్నావ్ రా.. తల్లి ఒడిలో నుండి తప్పిపోయిన బిడ్డ లాగా ఏడుస్తున్నాఅని చక్రి చెప్తాడు. అన్నయ్య ఎక్కడ అని కన్నా అడుగుతాడు. దూరానున్న మాధవని చూసి కన్నా వెళ్లి తనని హగ్ చేసుకొని ఏడుస్తాడు. నిన్ను ప్రాణంగా పెంచాను కదరా అని మాధవ ఏడుస్తాడు. ఆ తర్వాత నారాయణ ఇంటికి వస్తాడు. కన్నా కన్పించాడా అని మహా అడుగుతుంది. వాడు ఎక్కడికి వెళ్తాడు.. వస్తాడని నారాయణ అంటాడు. మరొకవైపు మహాకి చక్రి ఫోన్ చేసి కన్నా దొరికాడని చెప్తాడు. కేశవకి ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత కేశవ ఇంటికి వస్తాడు. కాసేపటికి కన్నాని తీసుకొని చక్రి, మాధవ వస్తారు. కన్నాని చూసి కేశవ ఎమోషనల్ అవుతాడు. ఎందుకు ఈ నిజం చెప్పావని నారాయణని కన్నా కోప్పడతాడు. మహా వచ్చి కన్నా చెంప చెల్లుమనిపిస్తుంది. నువ్వే కదరా ఒక స్త్రీ గురించి తన కాలర్ పట్టుకొని తప్పుగా మాట్లాడావ్... నిన్ను పెద్ది బిడ్డలాగా పెంచాడు.. తనని ఎలా బాధపెట్టాలనిపించింది రా అని మాధవ గురించి కన్నాకి మహా గొప్పగా చెప్తుంది. నువ్వు చేసిన తప్పుకి పెద్ది కాళ్లపై పడి క్షమించమని అడుగమని మహా అనగానే కన్నా అలాగే మాధవ కాళ్లపై పడి క్షమించమని అడుగుతాడు.

ఆ తర్వాత కన్నా మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడోనని మాధవ తన కాలికి, కన్నా కాలికి టవల్ కడుతాడు. అది చూసి నేను ఎక్కడకు వెళ్ళను అన్నయ్య అని చెప్తాడు. సరే అది ఉండనివ్వు.. అప్పుడే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావని కన్నా అంటాడు. మరుసటి రోజు కన్నాని ఆ మూడ్ నుండి బయటకు రప్పించడానికి కన్నాని తీసుకొని మహా బయటకు వస్తుంది. అక్కడ జరిగింది మర్చిపోమని కన్నాకి చెప్తుంది. తరువాయి భాగంలో అందరు ఒక ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com