Podharillu : నారాయణ మాటలకి చక్రి హ్యాపీ.. మాధవకి అనుమానం!
on Feb 10, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -46 లో...... చక్రి, మహా రిసెప్షన్ జరుగుతుంది. అందరు వెళ్ళిపోయాక మహా, చక్రికి మాధవ భోజనం వడ్డిస్తాడు. మహా మాత్రం తినకుండా ఆలోచిస్తుంది. ఆ తర్వాత మహా రూమ్ లోకి వెళ్లి బాధపడుతుంది. చక్రి వాళ్ళ నాన్న నారాయణ దగ్గరికి చక్రి వెళ్లి మాట్లాడుతాడు. ఒరేయ్ నువ్వు ఒక్కడివే నా పరువు నిలబెట్టావ్.. ఇన్ని రోజులు ఈ ఇంటికి శాపం ఉందని అనుకున్నారు కానీ నువ్వు పెళ్లి చేసుకొని వచ్చి అది అబద్ధం చేసావ్ అని నారాయణ అంటాడు.
అసలు రిసెప్షన్ ఐడియా ఇచ్చిందే నేను. మళ్ళీ మీ అమ్మ తాడు ఇచ్చి ఆ అమ్మాయికి గొలుసు తీసుకొని వచ్చానని నారాయణ చెప్పగానే చాలా మంచి పని చేశావని చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదంతా మాధవ చూసి వీడు తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నా అన్నాడు మరేంటి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని మాధవ అనుకుంటాడు. చక్రి వస్తుంటే మాధవ ఎదురు పడతాడు. చక్రి తప్పించుకొని వెళ్ళిపోతాడు. మహా దగ్గరికి చక్రి వెళ్తాడు. మీరు అక్కడే ఉండండి. రేపు నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని మహా కచ్చితంగా చెప్తుంది. ఆ తర్వాత చక్రిని మాధవ పక్కకి తీసుకొని వెళ్లి అనుకోకుండా పెళ్లి అన్నావ్.. మరి నిన్ను చూస్తే అలా అనిపించడం లేదని మాధవ అడుగుతాడు. నిజం అన్నయ్య తనంటే నాకు చాలా ఇష్టం కానీ కావాలని ఏది చెయ్యలేదు.. తనకి వాడితో పెళ్లి ఇష్టం లేదని చక్రి చెప్తాడు.
చక్రి తన తమ్ముళ్ల దగ్గర పడుకుంటే.. ఇక్కడ ఎందుకు వదిన గదిలోకి వెళ్ళమని కన్నా అంటాడు. అన్నయ్యకి పెళ్లి కాకుండా మేమ్ హ్యాపీగా ఉండలేమని చక్రి అంటాడు. అప్పుడే మాధవ వచ్చి సిచువేషన్ తగట్టు ఏం మాట్లాడుతున్నావురా అని మాధవ అనుకుంటాడు. మరుసటి రోజు మహా స్నానం చేసి బట్టలు పిండేసి ఆరేస్తుంది. అప్పుడే నారాయణ ప్రొద్దున లేచి డ్రింక్ చేస్తుంటే అది చూసి మహా చిరాకుగా ఫీల్ అవుతుంది. నన్ను వెంటనే హాస్టల్ కి పంపించండి అని చక్రితో మహా అంటుంది. ఆ మాటలు మాధవ వింటాడు. ఆ తర్వాత కన్నా, మాధవ బయటకు వెళ్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇంట్లో కూడా రిసెప్షన్ జరిగిందని మాధవతో కన్నా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



