Home

»

Tv News

Jayam serial : వీరుకి గంగ క్షమాపణలు చెప్పనుందా.. రుద్ర ఏం చేయనున్నాడు!

Feb 21, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -199 లో... ఇంటి అల్లుడిని  గంగ అవమానించిందని రుద్ర కోపంగా గంగని తన పుట్టింట్లో వదిలేసి వెళ్తాడు. మరొకవైపు ఇషిక, వీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవైపు సెంటిమెంట్ మరొకవైపు సింపథీతో గంగని ఇంట్లో నుండి పంపించేలా చేసావ్ బ్రో అని వీరుని ఇషిక మెచ్చుకుంటుంది. నా జోలికి వస్తే అలాగే ఉంటుంది. రుద్రని సైడ్ చేస్తే ఇక ఆస్తి, అధికారం రెండు నా గుప్పిట్లో ఉన్నట్లే .. ఎలాగూ అత్తయ్య నా గుప్పిట్లో ఉంది.. ఇక విజయంద్రప్రతాప్ కుటుంబం నా కాలికింద ఉండేలా చేస్తానని వీరు అంటాడు.

మరొకవైపు గంగ ఇంట్లో ఏడుస్తూ జరిగింది మొత్తం లక్ష్మి, పైడిరాజులకి చెప్తుంది. వీరు ఎలాంటి వాడో చెప్తుంది. నీ కుటుంబాన్ని ఆ రాక్షసుడి బారి నుండి నువ్వే కాపాడాలి.. అందుకోసం వాడికి క్షమాపణ చెప్పాలి.. నీతో కాదంటే మేం చెప్తాము పదా అని గంగని వెంటపెట్టుకొని లక్ష్మి, పైడిరాజు వెళ్తారు. మరొకవైపు గంగని తీసుకొని రుద్ర ఎక్కడికి వెళ్ళాడు. మీరు అయినా ఆపాల్సింది మావయ్య అని వీరు యాక్టింగ్ చేస్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు. గంగ ఎక్కడ అని పెద్దసారు అడుగుతాడు. వాళ్ళింట్లో వదిలేసానని రుద్ర చెప్తాడు. వదిలేసావా.. వదిలించుకొని వచ్చావా అని పెద్దసారు అంటాడు. ఎప్పుడు కుటుంబం బాగుండాలని అనుకుంటాను. అలాంటప్పుడు తన వల్ల కుటుంబంలో డిస్టబెన్స్ వస్తే నేను ఎలా ఊరుకుంటానని రుద్ర అంటాడు. కుటుంబం కోసం భార్యని వదిలేసి వస్తావా అని పెద్దసారు అంటాడు. 

అదంతా యాక్టింగ్.. ఇక్కడ ఉంటే భార్యని తిడుతారని అక్కడికి పంపించాడని శకుంతల అంటుంది. లేదు పెద్దమ్మ గంగ తరుపున నేను వీరుకి సారీ చెప్తానని రుద్ర కాళ్ళు పట్టుకోబోతుంటే అప్పుడే లక్ష్మి, పైడిరాజు వచ్చి.. మీరు కాదు సర్  సారీ చెప్పేది మేం అని లక్ష్మి,పైడి రాజు ఇద్దరు వీరు కాళ్ళ పై పడుతుంటారు. అప్పుడే గంగ వచ్చి వద్దని చెప్తుంది. మీరు కాదు నేను చేయాలి అని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com