ENGLISH | TELUGU  
Home  » TV News

భార్య కాళ్ళు పట్టుకున్న స్టార్ డైరెక్టర్!

on Mar 29, 2024

ధర్మేచ అర్దేచ కామేచ మోక్షేచ నాతిచరామి.. ఇలా ప్రతీ పెళ్ళిలో మంత్రాలు మారుమ్రోగుతుంటాయి. వీటి అర్థం ప్రతీ సినిమాలో చెప్పారు. అయితే నిజజీవితంలో ఎంతవరకు అమలు అవుతుందనేది భార్యభర్తలిద్దరు బయటకి చెప్పినప్పుడే తెలుస్తుంది. అదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఇదంతా ఎందుకంటే ఓ స్టార్ డైరెక్టర్ తన భార్యని కారులో అలా బయటకు తీసుకెళ్తూ కాళ్ళు నొక్కుతూ ఓ రీల్ ని తన ఇన్‌ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది. అసలెవర్రా బాబు అంటే.. బుల్లితెర ధారావాహికల్లో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న బ్రహ్మముడి, గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం. ఎస్ నిజమే.. అతనే ఈ స్టార్ డైరెక్టర్. స్టార్ మా టీవీలో ప్రతీనెల అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ పంతం‌.. తన అధ్బుతమైన కథతో, క్యారెక్టర్లని బుల్లితెర ప్రేక్షకులకి నచ్చేలా తీసుకెళ్తున్నారు. ఓ వైపు రిషి-వసుధారల లవ్ స్టోరీ, మరోవైపు కావ్య-రాజ్ ల పెళ్ళి బంధం.. ఇలా రెండింటిలో ప్రేమ, పెళ్ళిని విలువలతో కూడిన క్యారెక్టర్లని తెలుగింటి ఆడపడుచులకు అందిస్తున్నాడు. మరి ఆ డైరెక్టర్ బయట ఏం చేసిన ట్రెండింగ్ లోకి వెళ్తుంటాయి.

భార్యకి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వడం, తను అడిగితే తాజ్ మహల్ దగ్గరకి తీసుకెళ్ళడం.. తనేమడిగినా కాదనకుండా ఇస్తూ అన్నింటిని తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తున్నాడు కుమార్ పంతం.  తాజాగా కారులో అతని భార్యతో పాటు వెళ్తూ అలా తన భార్య కాళ్ళని నొక్కుతున్నట్టుగా ఓ వీడియోని షేర్ చేశాడు. నా కలలని కన్నది నీవే.. నా రేపటి వెలుగువి నీవే అంటూ సాగే పాటకి ఈ రీల్ ని చేశారు. ఇక ఈ రీల్ కి అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు డైరెక్టర్. ' ఈ కార్లు, హౌస్ ఇలా ఏవీ మనతో రావు. ఫైనల్ గా మనమిద్దరమే.. నీకు నేను ఉన్నాను.. నాకు నువ్వు ఉన్నావు. అండ్ థాంక్స్ బేబీ. ఫర్ వన్ మోర్ గ్రేట్ మెమోరీ టూ క్యాప్చర్ దిజ్ ' అంటూ కుమార్ పంతం క్యాప్షన్ రాసుకొచ్చాడు. ‌ఇక ఇప్పుడు ఈ రీల్ ని ఇటు గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు, అటు బ్రహ్మముడి సీరియల్ అభిమానులు, ‌మరోవైపు నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. మరి  ఈ డైరెక్టర్ కుమార్ పంతం  చేసిన రీల్ ని మీలో ఎంతమంది చూశారో కామెంట్ చేయండి.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.