Home

»

Tv News

Podharillu: మహాను చూసి ఎమోషనల్ అయిన ప్రతాప్.. వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

May 23, 2026 12:20PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -120 లో......నారాయణ మందు బాటిల్ ని కన్నా దాచేస్తాడు. దాంతో నారాయణ దానికోసం వెతుకుతాడు. అప్పుడే మహా వచ్చి మందుకి డబ్బు ఇచ్చి తెచ్చుకోమని చెప్తుంది. మా అమ్మ కదా అని నారాయణ అంటాడు. మీరు మెల్లగా మందు మానెయ్యాలని నారాయణకి మహా సలహా ఇస్తుంది. దాంతో నారాయణ సరే అంటాడు. మరొకవైపు చక్రి డల్ గా కేశవ దగ్గరికి వస్తాడు. ఏమైందని కేశవ అడుగుతాడు. ప్రతాప్ ఛాలెంజ్ చేసిన విషయం గురించి చెప్తాడు.

అలా ఏం తను వెళ్ళదు.. వాళ్ళ వదిన వచ్చి పిలిస్తేనే వెళ్ళలేదు.. అలాంటిది ఇప్పుడు వెళ్తుందా అని కేశవ భరోసాగా మాట్లాడతాడు. దాంతో చక్రి కాస్త రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత ప్రతాప్ కోపంగా ఇంటికి వెళ్లి ఆదికి జరిగింది చెప్తాడు. వాడు నాతో ఛాలెంజ్ చేసాడని ప్రతాప్ కోప్పడతాడు. దాంతో ప్రతాప్ ఒక ప్లాన్ చెప్తాడు. అందుకు ఆది, లలిత సరే అంటారు.

ఆ తర్వాత ప్రతాప్ తన డ్రైవర్ తో చక్రి ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. డ్రైవర్ దిగి ఇక్కడ బృందావనం ఇల్లు ఎక్కడ అని అడుగుతుంటే మాధవ ఎదురుపడతాడు . ప్రతాప్ దగ్గరికి మాధవ వెళ్లి మాట్లాడుతాడు. మా ఇంటికి కోసం మీరు వెతుకుతున్నారా అని మాధవ అనగానే నా కూతురు కోసమని ప్రతాప్ అంటాడు. పదండి ఇంటికి వెళదామని మాధవ అంటాడు. ప్రతాప్ ని తీసుకొని మాధవ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక నారాయణతో ప్రతాప్ మాట్లాడతాడు. మహా ఇల్లు దులుపుతూ కన్పిస్తుంది. అది ప్రతాప్ చూసి బాధపడతాడు. మహా వాళ్ళ నాన్నని చూసి ఎందుకు వచ్చావని అడుగుతుంది. నిన్ను చూడాలనిపించిందని ప్రతాప్ అనగానే మహా వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. కాసేపటికి ఇంట్లోకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది‌ మహా.  ప్రతాప్ ఈ ఇంటికి రావడానికి అసలు కారణమేంటంటే.. తనని ప్రేమతో మభ్యపెట్టి ఇంటికి తీసుకొని వెళ్లాలని ప్రతాప్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com