నిఖిల్ కి తప్ప ఎవరికైనా నేను ఒకే చెప్తాను
on Oct 3, 2025
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం #singles కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో నిఖిల్ విజయేంద్ర సింహ వచ్చి కూర్చున్నాడు. వెనక స్క్రీన్ మీద ఒక అమ్మాయి బొమ్మ అలా వస్తూ ఉంటుంది. ఇక శ్రీముఖి "నిఖిల్ అమ్మాయిలో ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ" అనేసరికి "కొంచెం హైట్ ఉండాలి.నా పార్టనర్ ఎంప్లొయ్ అయ్యి ఉండాలి " అని చెప్పాడు. "నిఖిల్ ఇదంతా నువ్వు అనుకుంటున్నావు చెప్తున్నావా లేదంటే ఎవరైనా ఆల్రెడీ ఉన్నారా" అని అడిగింది. వెంటనే నిఖిల్ "కత్తిలా ఉండాలబ్బా" అన్నాడు. ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఒక అమ్మాయి బొమ్మ వచ్చింది. "వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా హమ్మయ్య నేను అనుకున్న ఫోటో రాలేదు" అనుకుంటున్నాడని శ్రీముఖి చెప్పింది.
తర్వాత కావ్య తనకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పింది. "నాకన్నా హైట్ ఉండాలి. డ్రెస్ సెన్స్ బాగుండాలి..ఆ ఒక్కళ్ళు తప్ప వేరే ఎవరైనా కానీ ఒకే చెప్తాను " అని చెప్పింది. దాంతో బ్యాక్ స్క్రీన్ మీద నిఖిల్ విజయేంద్ర సింహ పిక్ వచ్చింది. "పేరులోనే ఆల్రెడీ" అని కావ్య అనేలోపు "మతలబు ఉందంటావా" అంటూ శ్రీముఖి అనేసింది. ఇక పరివారం షో మొదటి ప్రోమోలో ఐతే శ్రీముఖి కావ్య గురించి చెప్పుకొచ్చింది.." ఈ మధ్య కాలంలో కావ్య ఎక్స్క్లూజివ్ గా సింగల్ ఐపోయింది కాబట్టి" అనేసరికి "సింగల్ గా ఉండడం ఈ ఫేజ్ చూసిన తర్వాత ఇలా ఉండడమే బాగుంది" అని చెప్పింది కావ్య. దాంతో శ్రీముఖి "ఏయ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్ అని గూగుల్లో కొడితే కావ్య పేరే వస్తుంది" అంటూ మంచి జోష్ తో చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



