కార్తీక్, దీపలపై జ్యోత్స్నకి డౌట్.. క్షమాపణ చెప్పిన దశరథ్!
on Sep 6, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -455 లో..... ఇన్ని గొడవలకి కారణం నువ్వేనని దీపని మెడపట్టుకొని గెంటేస్తుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్, శివన్నారాయణ వస్తారు. నా భార్య ఏ తప్పు చేసిందని కార్తీక్ అడుగుతాడు. అగ్రిమెంట్ పై నువ్వు సంతకం పెట్టావ్.. నీ భార్య కాదు.. తను ఇక్కడ ఉండడం వద్దని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ ఎక్కడ ఉంటాడో.. దీప కూడా అక్కడే ఉంటుందని కార్తీక్ అంటాడు.
తప్పు మీద తప్పు చేయకండి అని జ్యోత్స్నని శివన్నారాయణ మందలిస్తాడు. ఇంకొకసారి ఇలాంటి సిచువేషన్ ఇంట్లో వస్తే ఎవరిని ఇంట్లో నుండి గెంటేయ్యడం ఉండదు.. నేనే వెళ్ళిపోతానని శివన్నారాయణ అంటాడు. కార్తీక్, దీప మీరు లోపలికి వెళ్ళండి అని శివన్నారాయణ అంటాడు. నా తండ్రిని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చారని జ్యోత్స్నతో దశరథ్ అంటాడు. మరోవైపు అసలు ఈ దీప ఎందుకు నువ్వు అన్ని అన్నా కూడా సైలెంట్ గా ఉంటుందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. నాకు అదే డౌట్ అని జ్యోత్స్న అంటుంది. కొంపదీసి ఆ బస్టాండ్ లో దొరికింది ఈ దీప కాదు కదా అని పారిజాతం అనగానే వెంటనే జ్యోత్స్న టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
బావ, దీపలకి నిజం తెలిసిందా.. అందుకే దీపని బావ ఇక్కడ ఉంచుతున్నాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు నా భార్య తరుపున నేను సారీ చెప్తున్నానని కార్తీక్, దీపలకి దశరథ్ సారీ చెప్తాడు. అది సుమిత్ర చూసి కోపంగా వస్తుంటే.. నేను విన్నాను మమ్మీ.. డాడ్ ఏంటి సారీ చెప్తున్నాడు. అంటే నువ్వు తప్పు చేసావన్నట్లే కదా.. అయినా నీ కంటే వాళ్లంటేనే డాడ్ కి ఇష్టమని దశరథ్ పై సుమిత్రకి కోపం కలిగేలా చేస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



