Karthika Deepam2 : మల్లెపూలతో బావ అని రాసిన దీప.. మురిసిపోయిన కార్తీక్!
on Jun 14, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -383 లో.....పారిజాతం కేక్ కింద పడేసిన వీడియో జ్యోత్స్నకి చూపించి కార్తీక్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న ని కిందకి రప్పించి.. కేక్ ఆర్డర్ చేస్తాడు. కేక్ పై దీప, జ్యోత్స్న అని రాసి ఉంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ పేర్లు జ్యోత్స్న పెట్టమందని కార్తీక్ అనగానే అవునని జ్యోత్స్న చెప్తుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి కేక్ కట్ చేస్తామని చెప్పమని జ్యోత్స్నకి కార్తీక్ సైగ చెయ్యగా.. మేమ్ ఇద్దరం కేక్ కట్ చేస్తామని జ్యోత్స్న అంటుంది.
వద్దని శివన్నారాయణ, సుమిత్ర అంటారు. ప్లీజ్ నా కోసం ఒప్పుకోండి అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. కాసేపటికి ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. సుమిత్ర, దశరథ్ కి జ్యోత్స్న కేక్ తినిపిస్తుంది. దీపకి దశరథ్ కేక్ తినిపిస్తాడు. జ్యోత్స్నకి కార్తీక్ సైగ చెయ్యగానే.. అమ్మ నువ్వు కూడా దీపకి తినిపించమని చెప్తుంది. సుమిత్రకి ఇష్టం లేకున్నా దీప కి కేక్ తినిపిస్తుంది. ఆ తర్వాత దీప ఆశీర్వాదం తీసుకోబోతుంటే సుమిత్ర వెళ్ళిపోతుంది. దీప, కార్తీక్ కలిసి దశరథ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత సుమిత్ర పడిపోతుంటే దీప పట్టుకోబోతుంది. వద్దని సుమిత్ర కోపంగా అంటుంది.
ఆ తర్వాత సుమిత్రకి కాలు బెణుకుతుంది. దాంతో దశరథ్ తనని గదిలోకి తీసుకొని వెళ్తాడు. సుమిత్ర అటు వైపుగా పడుకొని ఉంటుంది. దీప వచ్చి కాలుకి మందు రాస్తుంది. జ్యోత్స్న అనుకొని సుమిత్ర మాట్లాడుతుంది. తీరా చూసేసరికి దీప ఉంటుంది. దాంతో తనని కోప్పడి పంపిస్తుంది. ఆ తర్వాత దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. మరదలు అంటూ పిలుస్తాడు. బావ అనొచ్చు కదా అని కార్తీక్ అనగానే.. దీప మల్లెపూలతో బావ అని రాస్తుంది. అది చూసి కార్తీక్ మురిసిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
