Karthika Deepam2: కార్తీక్ కి చుక్కలు చూపించిన జ్యోత్స్న.. తాత ఫుల్ హ్యాపీ!
on May 24, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-365లో.. జ్యోత్స్న మాటలకు కాంచనకు చాలా ఆవేశం వస్తుంది. నువ్వు మా వదిన కడుపున చెడబుట్టావే.. అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కావడం లేదని తల బాదుకుంటూనే అల్లాడిపోతుంది. అయితే జ్యోత్స్న పొగరుగా.. అయితే నిర్ణయించుకో అత్తా.. నన్ను కొట్టే చెప్పు కూడా నా స్థాయిదే అయ్యి ఉండాలి.. నీ కోడలు స్థాయిది కాదంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నీ స్థాయి చెప్పుతోనే నిన్ను కొట్టిస్తాను కంగారు పడకు.. ముందు ఇక్కడి నుంచి వెళ్లమని తిడతాడు కార్తీక్. బావా సిద్ధంగా ఉండు.. నువ్వు నా అసిస్టెంట్వి. నా బానిసవి.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే 24 గంటల్లో 10 కోట్లు కట్టాలి.. అది గుర్తుపెట్టుకో అనేసి జ్యోత్స్న వెళ్లిపోతుంది. మీరు నన్ను చావుకు వదిలేసి బాగుండేది కదా అనేసి దీప ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. దానికే కాదు బాబు ఆ జ్యోత్స్న అన్ని మాటలు అంటుంటే మాకు అంతే బాధగా ఉంది అనేసి అనసూయ వెళ్లిపోతుంది.
అసలు నిన్నేం అనాలో అర్థం కావడం లేదురా.. దీప మీద నీకు ఇంత ప్రేమ ఉందని సంతోషించాలా.. నీ అంతట నువ్వే నీ జీవితాన్ని జ్యోత్స్నకు ఇచ్చావని అర్థం కావడం లేదురా.. అర్థం కావడం లేదని కాంచన ఏడుస్తుంది. ఏం కాదమ్మా.. నేను ఆ సంతకం సృహలేకుండా పెట్టలేదమ్మా.. ఆ క్షణంలో దీపను కాపాడుకోవాలంటే సంతకం పెట్టడం తప్ప వేరే దారి లేదు.. ఇది ఒక రకంగా మన మంచికే.. ముందు ముందు మీకే తెలుస్తుంది.. నీ కొడుకు తప్పు చేయడమ్మా.. నేను ఆలోచించే చేస్తానన్న నీ నమ్మకాన్ని పోగొట్టను అమ్మా అనేసి దీప దగ్గరకు కార్తీక్ వెళ్తాడు. ఇక దీపకి కార్తీక్ సర్దిచెప్తాడు కార్తీక్. ఇక మరునాడు కార్తీక్ రెస్టారెంట్‌కి వెళ్లేసరికే.. జ్యోత్స్న కార్తీక్ క్యాబిన్లో కార్తీక్ ఛైర్లో కూర్చుని కాలు మీద కాలేసుకుని పొగరుగా చూస్తుంది. అగ్రిమెంట్ విషయం గుర్తు చేసి.. బావా.. అసిస్టెంట్ గా నా ముందున్న బల్లను క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే.. చేసెయ్ అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. కార్తీక్ తల వంచి చెప్పినట్లు క్లీన్ చేస్తూ ఉంటే దీప వస్తుంది. అది చూసి షాక్ అవుతూ దగ్గరకు పరుగున వచ్చి జ్యోత్సని తిట్టేస్తుంది. బావా నా ఆఫీస్‌లో నీ భార్య పెత్తనం ఏంటీ తనని పంపించని జ్యోత్స్న అరుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ తో అన్ని పనులు చేపిస్తుంది.
ఇక కార్తీక్ టేబుల్ తుడవడం దగ్గర నుంచి.. కాఫీ అందించడం వరకు జ్యోత్స్న ముందు సేవల చేయడం అంతా తను వీడియో తీసి తాతకు పంపిస్తుంది. అది చూసి శివన్నారాయణ చాలా సంబరపడతాడు. సుమిత్ర, దశరథ్, పారిజాతంలకి చూపించి.. నా మనవరాలు సాధించింది.. ఆ కార్తీక్ గాడి తల వంచింది. వాడు వాడు పొగరు అణిగిందంటూ సంబరంగా ఇంట్లో వాళ్లతో చెబుతూ వీడియోని పదే పదే చూసుకుంటూ మురిసిపోతాడు శివనారాయణ. అదే విజయం నాన్నా అంటూ దశరథ్ అంటుంటే.. దశరథ్ మాటలకు సుమిత్ర కూడా అవునన్నట్లే చూస్తుంది. ఇక కార్తీక్ టేబుల్ తుడవడం దగ్గర నుంచి.. కాఫీ అందించడం వరకూ కార్తీక్.. జ్యో ముందు సేవల చేయడం అంతా వీడియో తీసి.. తాతకు పంపిస్తుంది జ్యో. అది చూసి చాలా సంబరపడతాడు శివనారాయణ. సుమిత్ర, దశరథ్ లకి పదే పదే చూపిస్తాడు శివన్ . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
