.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం 2 Karthika Deepam2 .ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 746 లో....జ్యోత్స్న కోపంగా జీవితాంతం ఒంటరిగా ఉంటాను.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్తుంది.. సూరజ్ ఇచ్చిన చురకతో గెటప్ మొత్తం మార్చి చీరకట్టి వస్తుంది. ఆ మార్పు చూసిన దీప.. జ్యోత్స్న తో క్లోజ్ గా మాట్లాడుతుంది. జీవితంపై విరక్తి కలిగిందని జ్యోత్స్న అనగానే అది విరక్తి కాదు.. సూరజ్ నిన్ను తిరస్కరించిన బాధనా అని దీప గుచ్చిగుచ్చి అడుగుతుంది. సూరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడు, పంతానికి పోయి పెద్ద తప్పు చేయకని దీప నచ్చజెప్తుంది. నీ మనసులో నేను ఉన్నాననే నమ్మకం వచ్చిన రోజు ఏడడుగులు నడుస్తానని సూరజ్ చెప్పిన మాట గుర్తొచ్చి జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటుంది. కళ్లే ప్రేమను బయటపెడతాయని దీప ఆమెకు అర్థమయ్యేలా చెప్తుంది.
అదే సమయంలో సూరజ్, కార్తీక్ అక్కడికి వస్తారు. చీరలో జ్యోత్స్నని చూసి సూరజ్ .. పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారంట అని వెటకారంగా అంటాడు. ఇక సూరజ్ మాటలు పట్టించుకోకుండా జ్యోత్స్న అక్కడి నుండి వెళ్లిపోతుండగా కార్తీక్ చూసి సూరజ్ తో మాట్లాడతాడు. ఆడాళ్ల మనసుతో ఆడుకోకు, జ్యోత్స్న డిప్రెషన్ లోకి వెళ్తుందని సూరజ్ తో కార్తీక్ అంటాడు.. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడు, అందుకే పెళ్లి వద్దంటుంది. ఇదంతా నాటకమని సూరజ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న జ్యోత్స్న.. నా లైఫ్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు ఎలా ఫ్రీడమ్ ఉందో నాకూ అలాగే ఉందని కోప్పడుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా నా ఇష్టం మారదని సూరజ్ ధైర్యంగా చెప్పి వెళ్లిపోతాడు
గొడవ తర్వాత కార్తీక్, దీప దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. దీప సూటిగా.. జ్యోత్స్న సూరజ్ ని తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోదు. ఆమె నిన్ను మనసులో నుంచి కన్నీళ్లతో తుడిచేసిందని చెప్తుంది. ఇన్నేళ్ల ప్రేమ అలా ఎలా పోతుందని కార్తీక్ బాధపడగా.. జ్యోత్స్నలో మార్పు వచ్చింది. ఆమె ఆఫీస్ కి వచ్చేది సూరజ్ కోసమే. వాళ్లది మామూలు ప్రేమ కాదని దీప క్లారిటీ ఇస్తుంది. చివరికి జ్యోత్స్న మనసులోని మాట బయటపెట్టి, చిగురిస్తున్న జ్యోత్స్న సూరజ్ ప్రేమకు దీపే వారధిగా నిలుస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
