Home

»

Tv News

Karthika Deepam2:జ్యోత్స్నకు లవ్ ప్రపోజ్ చేసిన సూరజ్, ఇకపై అసలైన ఆట!

Jun 15, 2026 11:38AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2. ఈ సీరియల్ ఇప్పటికే 696 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ కి మొదటి సీజన్ నుండి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మేకర్స్ సీజన్-2 తీసుకొచ్చారు. ఇందులో కార్తీక్, దీపల కష్టాలు చూసి తెలుగు రాష్ట్రాలలోని టీవి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.

మొదటి సీజన్ లో మోనిత విలన్ అయితే ఈ సీజన్ లో జ్యోత్స్న విలన్ రోల్ ని చేస్తుంది. అయితే ఇందులో పారిజాతం కూడా విలన్ కి సపోర్ట్ రోల్ చేస్తూ కామెడీని కూడా బాగా పండిస్తుంది. అందుకే ఈ పాత్రకి ఎక్కువమంది ఆడియన్స్ ఫాన్స్ గా మారారు. కథ మొదలైన విధానమే కొత్తగా ఉంది.‌ సీరియల్ మొదటి ఎపిసోడ్ లో కోమాలోకి కనపడకుండా పోయిన జ్యోత్స్న వాళ్ళ నాన్న దాస్.. ఎప్పుడో నాలుగొందల ఎపిసోడ్ లో వచ్చాడు. దాస్ వచ్చిన నుండి కథ స్వరూపమే మారిపోయింది. ‌దశరథ్, సుమిత్రల సొంతకూతురు దీపే అనే విషయం కార్తీక్, దశరథ్ లకి దాస్ చెప్పడంతో కథ పూర్తిగా పాజిటివ్ గా మారిపోయింది. ‌అప్పటిదాకా మాములుగా పారిజాతం, జ్యోత్స్న విలనిజం, కార్తీక్, దీపల ప్రతిఘటనల ఉంది. ఎప్పుడు అయితే దీపే సొంతకూతురు అని తెలిసిందో అప్పటి నుండి జ్యోత్స్నకి కష్టాలు మొదలయ్యాయి. ‌

ఇక తాజా ఎపిసోడ్ ల సూరజ్ ఎంట్రీ ఇచ్చాడు. దీప, జ్యోత్స్న ఇద్దరు‌ ఒక కంపెనీని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ పోటీలో దీపకి సపోర్ట్ గా సూరజ్ రావడంతో జ్యోత్స్నకి దిమ్మతిరిగింది. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్ ల క్రితం సూరజ్ ని జ్యోత్స్న అవమానించడంతో అతను తనమీద రివేంజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. జ్యోత్స్న కూడా రివేంజ్ ప్లాన్ చేసింది. ఇలా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుండగా ఏకంగా దీపకి సపోర్ట్ గా వచ్చేశాడు. ఇక గతవారం నాటి ఎపిసోడ్ లో జ్యోత్స్నకి లవ్ ప్రపోజ్ చేయడం..‌ దానికి షాక్ అవ్వడం నడిచింది. అయితే జ్యోత్స్న తెలివితేటల ముందు సూరజ్ నిలుస్తాడా.. అసలు కంపెనీని దీప, జ్యోత్స్నల ఎవరు సాధిస్తారో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com