Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్న పెళ్లి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన సూరజ్!

Aug 8, 2026 9:43AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2'). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -743 లో..... సూరజ్ తో పెళ్లికి ఒప్పుకో అప్పుడు ఆస్తులు అన్ని.. నీ సొంతం అవుతాయని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. నాకు ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది. డబ్బు హోదా అవసరం లేదా అని పారిజాతం అంటుంది. డబ్బు అంటే ఇష్టం.. ఎప్పుడు దశరథ్ సుమిత్ర కూతురులాగా ఉండాలని జ్యోత్స్న అంటుంది. అది జరగాలంటే ఈ పెళ్లికి ఒప్పుకో లేదంటే నేనే అందరికి నువ్వు సుమిత్ర కూతురివి కాదని చెప్తానని పారిజాతం అంటుంది గ్రానీ అని జ్యోత్స్న కోప్పడుతుంది. నేను ఏం ఆశించి బిడ్డలని మార్చానో అది ఇప్పుడు జరగట్లేదు.. మరి ఏం చేయమంటావ్.. ఇప్పుడు మీ వాళ్ళు అడిగినప్పుడు సూరజ్ తో పెళ్లి ఇష్టమని చెప్పాలి లేదంటే నా గురించి తెలుసు కదా అని పారిజాతం అంటుంది.

ఆ తర్వాత అందరు హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే సూరజ్ వస్తాడు. కారణాలు వెతుక్కోకుండా వచ్చినందుకు థాంక్స్ అని శివన్నారాయణ అంటాడు. కారణం ఉంది సర్ అని అయిదు లక్షలు తీసుకున్నా కదా సర్.. అవి ఇవ్వడానికి వచ్చానని సూరజ్ డబ్బు ఇస్తాడు. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పావ్ కానీ మేం ఎందుకు రమ్మన్నామో తెలుసుకోవా.. ముందు అసలు ఎందుకు వెళ్లిపోయావో చెప్పమని సుమిత్ర అంటుంది. ఒకటి అవమానం.. రెండు అనుమానం.. నేను ఎవరో ఏంటో అని నా వెనకాల ఎంక్వయిరీ జరిగింది.. అది బాధ గా ఉంది.. నేను అనాధ అని తెలిసి జ్యోత్స్నగారు నా దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టారని సూరజ్ చెప్తాడు. అవన్నీ పక్కన పెట్టు.. నీకు జ్యోత్స్న అంటే ఇష్టమా అని శివన్నారాయణ అడుగుతాడు. ఇష్టమే అని సూరజ్ చెప్తాడు. అయితే మీ ఇద్దరికి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని శివన్నారాయణ చెప్పగానే సూరజ్ షాక్ అవుతాడు. నాకు జ్యోత్స్న అంటే ఇష్టం తనకి నేను ఇష్టం లేదు.. తన మనసులో కార్తీక్ బ్రో ఉన్నాడని సూరజ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ మాట కాదని జ్యోత్స్నని దేవుడు మీద ఒట్టు వెయ్యమనండి అని సూరజ్ అంటాడు. ఇద్దరికి ఇష్టం అయితేనే బాగుంటుందని సూరజ్ చెప్తాడు.

నేను ఈ పెళ్లి ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తున్నానని సూరజ్ అనగానే ఏంట్రా నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా.. బంగారం అన్నావ్ ఐ లవ్ యు అని చెప్పావని జ్యోత్స్న అంటుంది. అవన్నీ నిజాలు.. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో..  నేను అంటే నీకు అంత ద్వేషమని సూరజ్ అంటాడు. అందరికి ఒకే అయింది ఒప్పుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు నువ్వు అంటే ఇష్టమని జ్యోత్స్న చెప్తే ఓకేనా అని సుమిత్ర అంటుంది. ఒకే కానీ బలవంతంగా మీరు చెప్పించొద్దు నా కళ్ళలో తన ప్రేమ స్పష్టంగా తెలిసినట్లు తన కళ్ళలో కూడా తెలియాలి.. అప్పుడు నేను తన మెడలో తాళి కడతానని సూరజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com