Home

»

Tv News

Karthika Deepam 2: కన్నకూతురికి దిష్టి తీయించి లోపలికి తీసుకొచ్చిన దశరథ్.. షాక్ లో పారిజాతం, జ్యోత్స్న!

Feb 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-601 లో.. దీపే తన కన్నకూతురు అనే నిజం దశరథ్ కి తెలుస్తుంది. దాంతో దీప, కార్తీక్ ఇద్దరిని తీసుకొని ఇంటికి వస్తాడు దశరథ్. అదే సమయంలో జ్యోత్స్న, పారిజాతం బయటకు వస్తుంటారు. దశరథ్ ని చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఎక్కడికి అమ్మా వెళ్తున్నావని దశరథ్ అడుగగా ఫ్రెండ్ దగ్గరికి అని జ్యోత్స్న అంటుంది. ఏం వద్దులే నీతో చాలా పని ఉంది అమ్మ అని దశరథ్ అంటాడు. నాన్న ఏంటి నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. 

నా కూతురు, అల్లుడు వచ్చారు‌. వారికి దిష్టి తీయడానికి కర్పూరం హారతి తీసుకొని రా పిన్ని అని పారిజాతంతో దశరథ్ అనగానే.. తను షాక్ అవుతుంది. ఇక సుమిత్ర, శివన్నారాయణలని పిలుస్తాడు దశరథ్. పారిజాతం దిష్టి తీయటానికి రెడీ అవుతుంటే సుమిత్ర నువ్వు తియ్ అని దశరథ్ అనగానే తను షాకింగ్ గా చూస్తుంది. మళ్లీ దిష్టి తీయమని దశరథ్ అనగానే ఇక తేరుకొని సుమిత్ర దిష్టి తీస్తుంది. 

ఆ తర్వాత అందరు లోపలికి వెళ్తారు. స్వీట్స్ తీసుకొచ్చి పారిజాతానికి ఇస్తాడు దశరథ్. నా కూతురికి తినిపించు పిన్ని అని పారిజాతంతో దశరథ్ అనగానే.. ఎవరికి తినిపించాలో తనకి అర్థం కాదు. నాకు కన్ఫూజన్ గా ఉంది నువ్వే తినిపించు అని స్వీట్స్ దశరథ్ కి ఇస్తుంది పారిజాతం. 

ఇక అవి తీసుకొని మొదటగా దీపకి తినిపిస్తున్నట్టుగా చేసి తర్వాత జ్యోత్స్నకి తినిపిస్తాడు దశరథ్. ఏం అయిందండి మీకు ఎందుకు ఇలా చేస్తున్నారని సుమిత్ర అడుగుతుంది. నేను గుడికి వెళ్ళాను.. అక్కడ దేవుడు నాకు ఒక సర్ ప్రైజ్ విషయం చెప్పాడని దశరథ్ అంటాడు. ఏంటని అడుగగా నా కూతురు జ్యోత్స్న ఉండగా నీకు టెన్షన్ ఎందుకని అని దశరథ్ అంటాడు. అవునని అందరు హ్యాపీగా ఉంటారు. 

అంతా ఒకే గానీ మరి దీపకి ఎందుకు దిష్టి తీయించావని దశరథ్ ని శివన్నారాయణ అడుగుతాడు. తనకి నేను కన్యాదానం చేసాను కదా దీప కూడా నా కూతురే కదా.. తన భాద్యతలు నేను తీసుకోవాలి కదా అని దశరథ్ అనగానే అవునని శివన్నారాయణ అంటాడు. ఇంతకి నాన్నకి నిజం తెలిసిందా లేదా అఅని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరి దాస్ ఎక్కడ అని పారిజాతం అనగానే ఇంటికే వస్తున్నాడని దశరథ్ అంటాడు. 

ఇక కార్తీక్, దీప కిచెన్ లోకి వెళ్తారు. కార్తీక్ ని దీప హగ్ చేసుకొని ముద్దు పెడుతుంది. థాంక్స్ బావ.. నాన్నకి నేను కూతురిని అని తెలిసాక ఎంత హ్యాపీగా ఉన్నాడో.. నాకు చాలా సంతోషంగా ఉందని దీప అంటుంది. నేనే కన్నకూతురు అని నాన్న ఎక్కడ చెప్తాడోనని టెన్షన్ పడ్డానని దీప అంటుంది. మరి పుట్టబోయే బిడ్డ గురించి తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడోనని దీప అనగానే అత్త కోసం మామయ్య ఏం అనలేడని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com