
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-600 లో.... దీప, బావ ఇంకా ఎందుకు రాలేదు.. నాన్న ఎక్కడికి వెళ్ళాడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. గ్రానీ నాకొక హెల్ప్ చేయాలి.. దీప, బావ ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలని జ్యోత్స్న అంటుంది. సరే అని కాంచనకి పారిజాతం ఫోన్ చేసి దీప వాళ్ళు ఇంకా పనికి ఎందుకు రాలేదని అడుగుతుంది. గుడికి వెళ్లారని కాంచన చెప్తుంది. ఇంట్లో మీ నాన్న కుడా లేడని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక చోట ఉన్నారా అని జ్యోత్స్న భయపడుతుంది.
మరొకవైపు అసలు నిజం తెలుసుకొని జ్యోత్స్న సంగతి చెప్తానంటూ వెళ్తున్న దశరథ్ ని కార్తీక్ ఆపుతాడు. ఇప్పుడు సమయం కాదని అంటాడు. అవును నాన్న.. ముందు అమ్మ ప్రాణాలు కాపాడాలని దీప అంటుంది. మీరు ఒక దీప గురించి ఆలోచిస్తున్నారు కానీ అత్త గురించి ఎందుకు ఆలోచించడం లేదని కార్తీక్ అంటాడు. నిజం నేను చెప్పేవరకు మీరు చెప్పొద్దూ.. నా మీద ఒట్టే అని దశరథ్ చేయి తన తలపై పెట్టుకుంటుంది దీప.
ఆ తర్వాత దాస్ మాట్లాడుతుంటే నువ్వు నాతో మాట్లాడకు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టావు నువ్వు అని దాస్ పై దశరథ్ కోప్పడుతాడు. మావయ్య మీరు దాస్ మావయ్యని తప్పుగా అర్ధం చేసుకున్నారు.. మీకు నిజం చెప్పాలని ట్రై చేసిన ప్రతీసారి జ్యోత్స్న ఆపింది.. ఒకసారి చంపాలని చూసింది.. మొన్న కిడ్నాప్ చేసింది తప్పించుకొని వచ్చాడని కార్తీక్ అనగానే సారీరా అని దాస్ ని దశరథ్ దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత మనల్ని కలిపిన ఆ దేవుడికి థాంక్స్ చెప్పాలని కార్తీక్ అంటాడు.
మరొకవైపు శ్రీధర్, శివన్నారాయణ లెక్కలు చూస్తారు. జ్యోత్స్న వాళ్ళని చూసి ఆగిపోయి.. ఇప్పుడు ఎలాగైనా బయటకు వెళ్ళాలని పారిజాతం సాయం తీసుకుంటుంది. ఇద్దరు వెళ్తుంటే జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళకు మీ నాన్న వచ్చేవరకు నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వొద్దు అన్నాడని శివన్నారాయణ అనగానే జ్యోత్స్నకి ఇంకా టెన్షన్ అవుతుంది.
మరొకవైపు కార్తీక్, దీపల పేరు మీద దశరథ్ అర్చన చేయిస్తాడు. నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉండాలని దశరథ్ అనగానే కార్తీక్ ని దీప పక్కకి తీసుకొని వెళ్లి నాన్నకి నా కడుపులో బిడ్డ సంగతి చెప్తే ఎంత బాధపడుతాడో అని అంటుంది. ఇప్పుడే నిజం చెప్పేస్తా అని కార్తీక్ అంటాడు. వద్దు.. నాన్న చాలా సంతోషంగా ఉన్నాడని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.








