
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -607 లో.. దీప తన కడుపులో బిడ్డని చంపాలని అనుకుంటుందని తెలిసి కార్తీక్, దీపపై దశరథ్ కోప్పడతాడు. నాకు మీ మీద డౌట్ వచ్చే మిమ్మల్ని ఫాలో అయ్యానురా.. ఎవడు ఇచ్చాడురా నా కూతురు కడుపులో బిడ్డని చంపే హక్కు అని కార్తీక్ పై దశరథ్ కోప్పడతాడు. మావయ్య మీకు అర్థం కావడం లేదు. కొంచెం ఆలోచించండి అని కార్తీక్ నచ్చజెప్తాడు కానీ దశరథ్ వినడు.
అయితే అత్త చచ్చిన పర్వాలేదా అని కార్తీక్ అంటాడు. దాంతో దశరథ్ షాక్ అవుతాడు. ఇప్పుడు వేరే మార్గం ఏదైనా ఉందంటే చెప్పు ఇప్పుడు ఈ అబార్షన్ ని ఆపేస్తామని కార్తీక్ అంటాడు. ఇప్పుడు అత్తని దీప తప్ప ఎవరు కాపాడలేరని కార్తీక్ చెప్తాడు. అయినా నేను ఇందుకు ఒప్పుకోలేకపోతున్నానని దశరథ్ అంటాడు. దీప ఏడుస్తుంది. ఇప్పుడు అత్తని కాపాడుకోవాలంటే ఈ పని చెయ్యక తప్పదని కార్తీక్ అంటుంటే ఎలా వస్తుందిరా నీకు ఇంత దైర్యం.... ఇప్పుడు మీరు నా కంటికి అంత ఎత్తున కన్పిస్తున్నారని దశరథ్ అంటాడు. మావయ్య మీరు ఇంటికి వెళ్లి బాగా ఆలోచించండి అని దశరథ్ ని కార్తీక్ పంపిస్తాడు. దీపని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్. దశరథ్ గారు ఒప్పుకున్నారా అని డాక్టర్ అడుగుతుంది. ఒప్పుకున్నాడని కార్తీక్ చెప్తాడు. వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చెయ్యాలి. దీపని అడ్మిట్ చెయ్యాలని డాక్టర్ అనగానే కార్తీక్ సరే అంటాడు. మరి నాన్నని ఎలా ఒప్పిస్తావని దీప అనగానే అంటే దశరథ్ గారు ఒప్పుకోలేదా అని డాక్టర్ అంటుంది. ఒప్పుకున్నారని దీపని బయటకు తీసుకొని వస్తాడు కార్తీక్.
ఆ తర్వాత సుమిత్ర బాగా దగ్గుతుంటే దశరథ్ వస్తాడు. సుమిత్ర నోట్లో నుండి బ్లడ్ వస్తుంది. అది చూసి దశరథ్ టెన్షన్ పడుతాడు. అప్పుడే దీప, కార్తీక్ వస్తారు. సుమిత్ర దగ్గరికి జ్యోత్స్న ని రానివ్వడు దశరథ్. నాకు నా కూతురు ఉండగా ఏం టెన్షన్ లేదని సుమిత్ర అంటుంది. త్వరగా ఆపరేషన్ కి ఏర్పాటు చెయ్యండి అని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. దశరథ్, కార్తీక్ బయటకు వెళ్తారు. సుమిత్రని చూసి దీప ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







