స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -732 లో...... మాలిని ఇంటికి జ్యోత్స్నని తీసుకొని పారిజాతం వెళ్తుంది. నన్ను ఎందుకు రప్పించావ్ చెప్పమని పారిజాతాన్ని జ్యోత్స్న కోప్పడుతుంది. నువ్వు ఏం అడిగినా ఇస్తాను మేనకోడలా అని మాలిని అంటుంది. ఆస్తిలో వాటా ఇస్తావా అని పారిజాతం అనగానే ఇస్తాను నా ఆస్తిలో సగం వాటా నా ఆడపడుచుకేగా అంటే తనకేగా అని మాలిని అనగానే చూసావా మీ మేనత్తకి నువ్వు అంటే ఎంత ఇష్టమోనని పారిజాతం అంటుంది. గ్రానీ మనం ఇక్కడ నుంచి వెళదాం పదా అని జ్యోత్స్న కోపంగా బయటకు వస్తుంది. అసలు తన మనసులో ఎవరున్నారని పారిజాతాన్ని మాలిని అడుగుతుంది.
దాని శత్రువు మొగుడు అని పారిజాతం చెప్పి వెళ్తుంటే మాలిని ఉంగరం కింద పడి ఉండడం గమనిస్తుంది. అది మాలినికి పారిజాతం ఇవ్వబోతుంటే నువ్వే తీసుకో పారిజాతం అనగానే పారిజాతం హ్యాపీగా తీసుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న ఆఫీస్ కి వెళ్లేసరికి సూరజ్ , కార్తీక , దీప ఒకే దగ్గరుంటారు. ఎక్కడికి వెళ్ళావ్ ఎందుకు వెళ్ళావని జ్యోత్స్నకి దీప, కార్తీక్, కార్తీక్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. తలనొప్పిగా ఉంది మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకున్నానని జ్యోత్స్న చెప్తుంది.నిన్ను చైర్మన్ గారు తీసుకొని రమ్మన్నారని కార్తీక్ చెప్తాడు.ఆ తర్వాత అందరు కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళావని జ్యోత్స్నని శివన్నారాయణ అడుగుతాడు. అప్పుడే పారిజాతం వస్తుంది. అందరు ఒకే చోట ఉన్నారు. కొంపదీసి మాలిని ఇంటికి వెళ్ళిన విషయం తెలిసిందా ఏంటని భయపడుతుంది. ఎక్కడికి వెళ్ళావని శివన్నారాయణ అడుగుతాడు.
అది నిజం చెప్పేసినట్లు ఉందని మాలిని దగ్గరికి వెళ్ళామని చెప్పబోతుంటే జ్యోత్స్న నేను ఏం చెప్పలేదని సైగ చేస్తుంది. దాంతో నేను హాస్పిటల్ కి వెళ్ళానని పారిజాతం చెప్తుంది. జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిందని కార్తీక్ అడుగుతాడు. అది తన ఫ్రెండ్ దగ్గరికి అని పారిజాతం అంటుంది. అప్పుడే పారిజాతం దగ్గరున్న రింగ్ కింద పడుతుంది అదెక్కడిది అని కార్తీక్ అడుగుతాడు. రోల్డ్ గోల్డ్ కొన్నానని పారు అంటుంది కానీ గతంలో మాలిని రింగ్ పడిపోతే సూరజ్ ఇచ్చిన విషయం గుర్తుచేసుకుంటాడు. సూరజ్ కి డౌట్ వచ్చి.. మీరు చెప్పేది అంతా అబద్ధం జ్యోత్స్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదని సూరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
