ఒంటరిగా వున్న వేదపై లైంగిక దాడికి సిద్ధపడిన కైలాష్!
on Jul 5, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ 'ఎన్నెన్నో జన్మల బంధం'. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా స్టార్ మా లో రాత్రి 9:30 గంటలకు ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరుకు చెందిన కన్నడ నటుడు నిరంజన్, కోల్ కత్తా నటి డెబ్జాని మోడక్ జంటగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, సుమిత్ర, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమాండ్ల, ఆనంద్, బేబీ మిన్ను నైనిక, రాజా శ్రీధర్ తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది.
వేదపై ఎలాగైనా దాడి చేయాలని, తన కోరిక తీర్చుకోవాలని పథకం వేసిన కైలాష్ సినిమాకు వెళదామని భార్య కంచుతో అంటాడు. మనసేమీ బాగాలేదని, ఇంట్లో వుంటే అవే ఆలోచనలు వెంటాడుతున్నాయని, సినిమాకు వెళితే రిలాక్స్ గా వుంటుందని చెబుతాడు. అంతే కాకుండా "మీ అమ్మ మాలినిని కూడా తీసుకెళదాం" అంటాడు. వెంటనే అంతా రెడీ అయిపోతారు. ఇంతలో తనకు దుబాయ్ నుంచి అర్జెంట్ కాల్ రావాల్సి వుందని, అది మాట్లాడేసి వస్తానని, మీరు ముందు వెళ్లండని చెబుతాడు. అలాగే అని కంచు, మాలిని సినిమాకు వెళ్లిపోతారు.
ఇంట్లో ఎవరు లేకుండా చేసిన కైలాష్ .. వేద కోసం ఎదురుచూస్తూ వుంటాడు. ఇదే సమయానికి వేద వాళ్ల బావ పుట్టిన రోజని వేద ఫ్యామిలీ కూడా వేరే చోటికి వెళ్లిపోతారు. ఇదే మంచి ఛాన్స్ అని ఎదురుచూస్తున్న కైలాష్ కి వేద ఒంటరిగా దొరుకుతుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన వేద చీర మార్చుకుంటుంటే చాటుగా చూస్తూ వుంటాడు కైలాష్. అది గమనించిన వేద "ఎవరు?" అని అరుస్తుంది. వెంటనే బయటికి వచ్చిన కైలాష్ వేదపై దాడికి పూనుకుంటాడు. తన నుంచి తప్పించుకుని వేద హాల్ లోకి వెళ్లినా వదలిపెట్టడు.. దీంతో నీకు చెల్లెలి వరుస అవుతానని, తనని ఏమీ చేయొద్దని వేద వేడుకుంటుంది.. అయినా సరే కైలాష్ ఆమె మాటలు వినకుండా వేదను బలవంతం చేయబోతాడు. ఈలోగా వేద చేతికి ఓ బలమైన కర్ర దొరుకుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? యష్ వచ్చే సరికి తను స్టేషన్ లో ఎందుకుంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read