.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ - 425 లో.. రుద్రకి బాలకృష్ణ నిజం చెప్పడానికి వస్తాడు కానీ శకుంతల అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది.బాలకృష్ణని చూసిన రుద్ర ఇప్పుడు నిజం చెప్పు, ఆ రోజు రామనాథంని చంపింది ఎవరు అని అడుగుతాడు. నాకు తెలియదు సర్ అని బాలకృష్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఇప్పుడు నిజం చెప్తావా లేదా చంపేస్తానని అతన్ని రుద్ర కొడతాడు.
అయినా అతను చెప్పకుండా తప్పించుకుని వెళ్తాడు. అతని వెనకాల గంగ, రంగా పరిగెడతారు. రుద్ర వెళ్లిపోతుంటే శకుంతల ఆపుతుంది. అతను ఏదో మైండ్ పని చేయక అప్పుడు ఏదో చెప్పి ఉంటాడు.. దాన్ని పట్టుకుని ఎందుకు ఇదంతా గొడవ అని శకుంతల అంటుంది.అనవసరంగా అతని మాటలు నమ్మి వీరుపై కంప్లైంట్ ఇచ్చావని శకుంతల అంటుంది. అతను ఇప్పుడే కదా కోమా నుంచి బయటకు వచ్చాడు కదా, తను మళ్లీ జరిగింది మర్చిపోయి ఉంటాడు, కొద్ది రోజులు టైమ్ పట్టొచ్చని విశ్వ అంటాడు. ఆ తర్వాత సర్ మీ ఫ్యామిలీ విడిపోకూడదనే నేను నిజం చెప్పలేదని బాలకృష్ణ అనుకుంటాడు.
ఆ తర్వాత గంగ, రుద్ర ఇద్దరు అవుట్ హౌస్ లోకి వస్తారు. మనం ఉండబోయేది ఇదే అని అంటుంది. అయితే ఏం చేయమంటావ్ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించమంటావా అని గంగతో రుద్ర వెటకారంగా మాట్లాడుతాడు. అప్పుడే రంగా గుమ్మడికాయ తీసుకుని వస్తాడు. అతనికి కూడా రుద్ర కౌంటర్ వేస్తాడు. బాలకృష్ణ ఎందుకు నిజం చెప్పలేదో రుద్రకి తెలుస్తుందా.. అసలు నిజం బయటపడుతుందా లేదా తెలియాలంటే తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
