Home

»

Tv News

Jayam serial : జయ పెళ్లి విషయంలో కుట్ర బయటపెట్టిన రుద్ర.. షాక్‌లో విశ్వ కుటుంబం!

Aug 4, 2026 9:44AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియస్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -337 లో.....జయకి వచ్చిన సంబంధం ఫ్రాడ్ అని అబ్బాయి మేనమామ చెప్తాడు. ఈ విషయం చెప్పడానికి రుద్ర ఇక్కడికి పంపించాడని అతను చెప్తాడు. అవును మావయ్య వాళ్ళ నిజస్వరూపం బయటపెట్టాలని ఇలా చేసానని రుద్ర అంటాడు. ఇక ఈ ఎంగేజ్మెంట్ జరగదని విశ్వ అందరిని పంపిస్తాడు. ఇప్పుడు నాకు అర్ధం అయింది.. మీ చెల్లెలిని మీకు దూరం చేసాననే పగతో ఇప్పుడు నేను నా కుటుంబం అవమానపడేలా చేశారు.. బాగా అర్థం అయింది ఏవండి శకుంతలదేవి గారు మీ కూతురు శ్రీమంతానికి వచ్చి పిలిస్తే వచ్చి ఆశీర్వదించాను కానీ ఇప్పుడు మీరు నా కూతురు అవమానపడేలా చేశారని విశ్వ అంటాడు.

ఆ తర్వాత రుద్ర ఏదో చెప్పబోతుంటే నువ్వు అగు రుద్ర నీ దగ్గరికి తర్వాత వస్తానని విశ్వ అంటాడు. ఏం వీరు నువ్వు మంచివాడివని నమ్మాను.. నువ్వు చెప్పింది బ్లైండ్ గా నమ్మి నిన్ను ఫాలో అయ్యాను.. రెండు కుటుంబాలని కలపాలి.. అందరి మెప్పు పొందాలని ఆలోచించావ్ అంతే కదా.. అదే నీ సొంతచెల్లెలు విషయంలో ఇలాగే చేస్తావా అని విశ్వ అంటాడు. ప్రమీల నిన్ను చుస్తే బాధగా ఉంటుంది.. నిన్ను వాళ్ల పరువు ప్రతిష్ట అంటూ కట్టిపారేసారు.. పరువు కోసం నన్ను చంపాలనుకున్నారు.. ఇప్పుడు నా పరువు తీశారని విశ్వ అంటాడు. రుద్ర నీకు ముందే తెలిసినప్పుడు నాకు చెప్పాలి కదా అలా చెప్పకుండా ఇలా పరువుతియ్యాలనుకున్నావా అని విశ్వ అనగానే లేదు మావయ్య నిజం ఏంటోనని మీకు తెలియలని ఇలా చేసానని రుద్ర చెప్తాడు.

ఇక ఈ విజయేంద్ర ప్రతాప్, రుద్ర వీరు కలిసి ప్లాన్ గా ఇలా పరువు తీశారు. సుధా నీకు పుట్టిల్లు లేదని విశ్వ అంటాడు. ఒక్క నిమిషం విశ్వ.. ఇప్పుటివరకు నువ్వు చెప్పింది విన్నాము.. మా వల్ల నీ పరువుపోయిందని అంటున్నావ్ కదా.. ఇప్పుడు మాటిస్తున్నా నీ పరువు గౌరవం నేను నిలబెడుతానని పెద్దసారు అంటాడు. రాఘవ, ఇందుమతి నేను ఏం నిర్ణయం తీసుకున్న మీరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. మీ మాట ఎప్పుడు కాదన్నమని వాళ్ళు అంటారు. ఇప్పుడే జయకి వంశీ కి ఎంగేజ్మెంట్ జరగాలని పెద్దసారు అంటాడు. ఏవండి అని శకుంతల ఏదో చెప్పబోతుంటే నేను నిర్ణయం తీసుకున్నానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com